22k Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర దిగొచ్చింది. దీంతో కొనుగోలుదారులకు ఊరట దక్కుతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయని చెప్పొచ్చు. భారతదేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా మహిళలు పండగలు, వివాహాలు, ఇతర వేడుకల వేళ కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. కొంత కాలంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరగడంతో అటువైపు పెట్టుబడులు పెరిగి ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గతేడాది బంగారం ధర 70 శాతం వరకు పెరిగింది. ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రారంభంలో భారీగానే పెరిగిన బంగారం ధర తర్వాత వరుసగా తగ్గుతోంది. వరుసగా 5వ రోజు కూడా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మార్చి 7న చూస్తే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1600 తగ్గి తులం రూ. 1,47,700 వద్ద ట్రేడవుతోంది. దీనికి ముందు చూస్తే వచ్చింది. ఈ క్రమంలోనే 5 రోజుల్లో గోల్డ్ రేటు ఏకంగా రూ. 10,950 దిగొచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే తాజాగా మార్చి 7న ఉదయం 7 గంటలకు రూ. 1750 తగ్గి 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,61,130 వద్ద కొనసాగుతోంది. ఇది గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ. 11,960 మేర తగ్గింది. >> బంగారం ధర భారీగా దిగొస్తున్న నేపథ్యంలో కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇక్కడ వెండి ధర ఒక రోజు స్థిరంగా ఉంటూ.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. మార్చి 7న చూస్తే మరో రూ. 5 వేలు తగ్గగా హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉంది. మార్చి 4న రూ. 20 వేలు, మార్చి 2న రూ. 10 వేల మేర తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే మాత్రం కిందటి రోజుతో పోలిస్తే గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 5,170 డాలర్ల స్థాయిలో ఉండగా.. సిల్వర్ రేటు 84.50 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. ఇక డాలరుతో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 91.78 స్థాయిలో ఉంది. బంగారం ధర తగ్గేందుకు కారణాలివే..ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉన్నప్పటికీ బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణం.. యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం. సాధారణంగా డాలర్ పెరిగితే.. బంగారానికి విలువ తగ్గుతుంది. ఆకర్షణ కోల్పోతుంది. డాలర్ పుంజుకుంటే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయడం భారంగా మారుతుంది. దీంతో అటువైపు పెట్టుబడులు తగ్గి ఎక్కువ రాబడి వచ్చే బాండ్ ఈల్డ్స్‌పైకి వెళ్తారు. ఇంకా ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇది తదుపరి సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల్ని మసకబారేలా చేసింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తేనే.. బంగారం ధర పెరుగుతుంటుంది. ప్రస్తుతం అంచనాలు తలకిందులు కావడంతో బంగారం ధర దిగొస్తుంది.గమనిక: ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మార్చి 7న ఉదయం 7 గంటల సమయంలోనివి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మళ్లీ మార్చి 7 ఉదయం 10 గంటలకు ధరల్లో మార్పు ఉండొచ్చు. ప్రస్తుత పరిణామాల్ని బట్టి.. కాస్త రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కావును.. కస్టమర్లు గమనించాలి.