వరుసగా తగ్గి సడెన్‌గా పెరిగిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే.. హైదరాబాద్‌లో తులం ఎంతకు చేరిందంటే?

Wait 5 sec.

: పసిడి ప్రియులకు ఊహించని విధంగా సడెన్ షాక్ తగిలింది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా దేశీయంగా గత వారం రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. తులం బంగారం రేటు ఏకంగా రూ.10 వేల మేర తగ్గింది. అయితే, ఇంకా తగ్గుతుందని భావించిన వారికి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు బంగారం ధరలు సడెన్‌గా పెరిగాయి. ఇరాన్ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చన్న అంచనాలు, డాలర్ విలువ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు చెబుతున్నాయి. అలాగే గత వారం పాటు ధరలు తగ్గడంతో కనిష్ఠ రేట్ల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళుకు మొగ్గు చూపడమూ ఓ కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో మార్చి 8వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఎంత ఉందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 21 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 5171 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.46 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 84.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై ఏకంగా రూ.2300 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,50,000 మార్క్ తాకింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఈరోజు తులంపై రీ.2510 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,63,640 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటుబంగారం ధర పెరిగినా వెండి మాత్రం ఊరట కల్పించింది. ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే ఉంది. గత వారం రోజుల్లో కిలో వెండి రేటు రూ.35000 మేర తగ్గిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 8వ తేదీ ఆదివారం రోజున ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్ ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతుంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానిక ధరలను తెలుసుకోవడం మంచిది.