బంగారంపై భారీ లాభాలు.. టాక్స్ రూల్స్ మారాయి.. దేనిపై ఎంత టాక్స్ కట్టాలో తెలుసా?

Wait 5 sec.

: బంగారం ధరలు కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధర చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1 లక్ష మార్కు చేరుకున్నప్పుడే షాకైన జనం.. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ జువెల్లరీ రేటు కూడా రూ. 1 లక్ష మార్కు దాటి ఇప్పుడు రూ. 1.10 లక్షలపైన ఉంది. దీంతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డు గరిష్టాలకు చేరాయి. అమెరికా షట్ డౌన్ సహా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండటం వంటి కారణాలతో పెట్టుబడిదారులు.. బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ధర ఇంకా పెరుగుతోంది. చెప్పొచ్చు. దీంతో భౌతిక బంగారం కొనుగోలు చేసిన వారికి.. ఇతర పెట్టుబడి సాధనాల్లో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా మంచి లాభాలే వచ్చాయి. ఇక్కడ మీరు బంగారం విక్రయిస్తే వచ్చే లాభాలపై పన్ను చెల్లించాలన్న సంగతి తెలుసా. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. 2024, జులై 23 నుంచి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గెయిన్స్‌పై కొత్త టాక్స్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ దీర్ఘకాలిక మూలధన లాభాలపై టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బంగారు ఆభరణాలు అయినా, డిజిటల్ పెట్టుబడులు అయినా.. విక్రయించినప్పుడు లాభాలపైన ఎంత పన్ను కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. >> మీరు. ఇది 3 శాతంగా ఉంటుంది. ఇంకా నగలు కొనుగోలు చేసే సమయంలో.. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక విక్రయించే విషయానికి వస్తే.. కొత్త రూల్స్ కింద ఇండెక్సేషన్ బెనిఫిట్ (ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడం) తొలగించారు. మీరు భౌతిక బంగారం అంటే జువెల్లరీ, కడ్డీలు వంటి వాటిల్లో 24 నెలల్లోపు హోల్డింగ్ చేస్తే.. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పన్ను శ్లాబు ప్రకారం చెల్లించాలి. 24 నెలలు దాటితే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 12.5 శాతంగా ఉంది. గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లో 12 నెలలలోపు విక్రయిస్తే.. ఇక్కడ పన్ను శ్లాబుల ప్రకారం.. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పడుతుంది. 12 నెలలు దాటితే 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాలి. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే.. మీకు ఇక్కడ వచ్చిన లాభాల్ని.. మీ మొత్తం ఆదాయంలో కలుపుతారు. అప్పుడు ఆదాయపు పన్ను విధానాల్లోని టాక్స్ శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై మెచ్యూరిటీ వరకు అయితే లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఏడాదిలోపు ముందస్తుగా విక్రయిస్తే ఇక్కడ పన్ను శ్లాబుల ప్రకారం టాక్స్ పడుతుంది. 12 నెలల తర్వాత మెచ్యూరిటీకి ముందు విక్రయిస్తే 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాలి.