రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ ట్రైన్ కోసం చర్లపల్లికి వెళ్లక్కర్లేదు, నాంపల్లి స్టేషన్ నుంచే..

Wait 5 sec.

హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి బయల్దేరే చర్లపల్లి- డెహ్రాడూన్ ( ట్రైన్ నెంబర్ 07077/07078) ప్రత్యేక రైలు టెర్మినల్‌ను మార్చారు. ఈ రైలును ఎక్కడానికి ఇక ప్రయాణికులు నగరానికి సుదూరంలో ఉన్న చర్లపల్లి వరకు వెళ్లనక్కర్లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు టెర్మినల్‌ను నాంపల్లి స్టేషన్‌కు మార్చారు. ఈ మార్పు ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి మంగళవారం ఈ రైలు నాంపల్లి స్టేషన్‌ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 7:20 గంటలకు దేహ్రాదూన్‌ చేరుకుంటుంది. అలాగే.. డెహ్రాడూన్ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చర్లపల్లికి వెళ్లే ఇబ్బంది తప్పనుంది. సిటీ సెంటర్‌లో ఉన్న నాంపల్లి స్టేషన్ ద్వారా ఈజీగా రాకపోకలు సాగించే అవకాశం లభించనుంది. దీపావళి, ఛట్ పూజకు 12,000 ప్రత్యేక రైళ్లుదీపావళి, ఛట్ పూజల పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు సులభంగా చేరుకోవడానికి వీలుగా ఏకంగా 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగల సమయంలో రైళ్లలో ఉండే అధిక రద్దీని, టికెట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటు వల్ల పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ట్రైన్లు నడపనున్నారు. ట్రైన్ల వివరాలు రైల్వే శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక ట్రైన్లలో ఉండే రద్దీ దృష్ట్యా ముందుస్తు బుకింగ్‌లు చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.