ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. మరో డీఎస్సీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే మెగా డీఎస్సీను నిర్వహించి, మొత్తం 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసింది. నోటిఫికేషన్ జారీ, పరీక్షలు, ఫలితాలు సహా కేవలం ఐదు నెలల్లోనే ప్రక్రియను పూర్తిచేసి, అభ్యర్థులకు నియమాక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం కొత్త ఉపాధ్యాయులకు ప్లేస్‌మెంట్స్ కోసం కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే, త్వరలోనే మరో రానుంది. డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. గురువారం (అక్టోబరు 9న) విద్యాశాఖపై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబరులో టెట్, వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చిలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఏటా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నట్టు మంత్రి చెప్పారు. అలాగే, విద్యా విధానంపై అధ్యయనం కోసం సింగ్‌పూర్‌కి రాష్ట్రం నుంచి 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పంపనున్నట్టు లోకేశ్ వెల్లడించారు.మరోవైపు, టీచర్ల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. అంతర్‌ జిల్లాల బదిలీల టీచర్లు, భాషా పండిట్స్‌తో సమావేశమైన మంత్రి.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్య చేశారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి నంబర్‌వన్‌ చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు టీచర్ల సహకారం కావాలని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన మంత్రికి ఈ సందర్భంగా టీచర్లు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు బాగా చదువు చెబితే అదే తనకు ఇచ్చే పెద్ద బహుమతని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.