అమెరికాతో ట్రేడ్ డీల్.. అంతా మోదీ చేతుల్లోనే.. ట్రంప్‌ను కలుస్తారా లేదా?

Wait 5 sec.

: ఇండియా- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నా.. ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. త్వరగా ఖరారు చేసేందుకు.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భేటీ అవసరం అని అమెరికా భావిస్తోంది. 'వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందు.. ప్రధాని మోదీతో భేటీ కావాలని ట్రంప్ బృందం బలంగా కోరుకుంటోంది.' అని అధికారులు వెల్లడించారు.>> భారత విధానాలు దీనికి అడ్డుపడే అవకాశం ఉంది. సాధారణంగా ట్రేడ్ డీల్‌పై రెండు దేశాల ప్రతినిధులు ఒక ఏకాభిప్రాయానికి, అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు.. ట్రంప్- మోదీ భేటీ ఎలా సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ 'కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు కావొచ్చు. ఎందుకంటే చాలా కాలంగా అనుసరిస్తున్న ప్రోటోకాల్స్‌ను ట్రంప్ పలుమార్లు పక్కనబెట్టేశారు.' అని అధికారులు అంటున్నారు. అందుకే ఈసారి ట్రేడ్ డీల్ కుదరకముందే.. ట్రంప్- మోదీ భేటీపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అమెరికా- భారత్ వాణిజ్య చర్చలు సాగుతుండగా.. భారత్ తరఫున వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. గోయల్ బృందం.. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రోర్‌తో పలుమార్లు సమావేశమైంది. ఇప్పుడు తదుపరి దశలో ట్రంప్- మోదీ కూడా దీనిపై నేరుగా చర్చించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26- 28 మధ్య మలేషియా కౌలాలంపూర్ వేదికగా.. ఆసియాన్, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగానే.. సైడ్‌లైన్స్‌లో మోదీ- ట్రంప్ భేటీ అవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సమావేశానికి మోదీ హాజరవుతారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. మోదీ పర్యటన ఇప్పటివరకు ఖరారు కూడా కాలేదు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదానిపై ఆగ్రహించిన ట్రంప్ సర్కార్.. ఒక్కసారిగా మన దేశంపై 25 శాతం దిగుమతి సుంకాల్ని విధించింది. . ఇటీవల భారతీయుల వాటా ఎక్కువగా ఉన్న.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును అక్కడ ఏకంగా 1 లక్ష డాలర్లకు పెంచారు ట్రంప్. ఇంకా వేర్వేరు సుంకాలు విధిస్తున్నారు. ఇదే సమయంలో మధ్యలో.. భారత్- పాక్ మధ్య తానే శాంతి నెలకొల్పానని పలుమార్లు ట్రంప్ ప్రకటించుకోగా.. భారత్ దీనిని ఖండించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆగ్రహంతో ఇవన్నీ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.