దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ పేరుతో రింకూ సింగ్‌కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ, లేకపోతే..!

Wait 5 sec.

ముంబైకి ముచ్చెమటలు పట్టించిన పేరు చెబితే ఇప్పటికీ హడలే. స్టార్ట్ చేసిన ఈ డి-కంపెనీ 90వ దశకంలో ముంబైలో బడా బడా బిజినెస్ మ్యాన్స్, క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్‌ని వణికించింది. అయితే, ఇప్పుడు అదే డి-కంపెనీ పేరుతో కి గత కొద్ది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయి. రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ మెసెజ్‌లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేషనల్ మీడియా కథనం మేరకు.. నవీద్ అనే వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రింకుకు వరుసగా మెసేజ్‌లు పంపుతున్నాడు. మొదట అభిమానిగా పరిచయం చేసుకున్న నవీద్.. ఆ తర్వాత నేరుగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. ఏప్రిల్ 5న నవీద్ తన మొదటి మెసెజ్‌లో “నేను మీ అభిమానిని, మీరు కేకేఆర్ కోసం ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కృషి కొనసాగించండి. ఒక రోజు మీరు మీ కెరీర్‌లో ఉన్నత శిఖరానికి చేరుకుంటారు. చిన్న సహాయం చేయగలరా? అల్లా మీకు ఇంకా దీవెనలు ఇస్తాడు, ఇన్‌షా అల్లా” అని రాశాడు.అయితే, కొన్ని రోజులకే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఏప్రిల్ 9న పంపిన రెండో మెసెజ్‌‌లో నేరుగా “నాకు రూ.5 కోట్లు కావాలి. సమయం, ప్రదేశం నేను చెబుతాను” అని పేర్కొన్నాడు. రింకూ ఎలాంటి రిప్లయ్ ఇవ్వకపోవడంతో, ఏప్రిల్ 20న చివరి మెసేజ్ పంపుతూ “రిమైండర్! డి-కంపెనీ (గుర్తు పెట్టుకో! డి-కంపెనీ)" అని హెచ్చరించాడు. రింకు సింగ్ తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత జట్టుకు విజయాన్ని అందించిన హీరోగా నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో తాను ఆడిన తొలి బంతికే చక్కటి బౌండరీ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.విజయానంతరం రింకూ మాట్లాడుతూ “ఇంకేం మేటర్ కాదు... ఆ ఒక్క బంతి మేటర్. ఒక రన్ కావాలి, నేను ఫోర్ కొట్టాను. అందరికీ తెలుసు, నేను ఫినిషర్‌ని. జట్టు గెలిచింది, అదే నాకు సంతోషం” అని అన్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 34 టీ20లు, 2 వన్డేలు ఆడి మొత్తం 605 పరుగులు సాధించాడు. తక్కువ సమయంలోనే ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఈ యువ బ్యాటర్, ఇప్పుడు ఇలా బెదిరింపులు రావడంతో షాక్‌లో ఉన్నాడని సమాచారం. పోలీసులు ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రింకు సింగ్ భద్రతపై కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలనే అవసరం ఏర్పడింది.