2035లోపు రూ.1 కోటి సంపాదించాలంటే.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? పూర్తి లెక్కలివే

Wait 5 sec.

SIP Plan: దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఉన్న ఉత్తమ మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటిగా చెప్తారు. అందులో (సిప్) సరైన మార్గం. ఒక నిర్దేశిత కాల పరిమితి ఉండి స్పష్టమైన ఆర్థిక లక్ష్యం ఉన్న వారు ఈ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని నెల నెలా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి వచ్చే 10 సంవత్సరాల్లో చేతికి రూ.1 కోటి అందుకోవాలంటే ఎంత రాబడి రావాలి? 2025లో పెట్టుబడి ప్రారంభిస్తే 2035 నాటికి కోటిరూపాయలు సంపాదించాలంటే మ్యూచువల్ ఫండ్ సిప్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో లభించే సిప్ కాలిక్యులేటర ద్వారా ఎంత రాబడికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్నేళ్లకు కోటి రూపాయలు వస్తాయి అని తెలుసుకోవచ్చు. వచ్చే రాబడులను బట్టి పెట్టుబడి అనేది మారుతుంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా ఫండ్స్ సగటున 12 శాతం రాబడి అందిస్తుంటాయి. అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు మీకు ఏడాదికి 12 శాతం చొప్పున రాబడి వస్తుందని అనుకుంటే పదేళ్లలో మీ పెట్టుబడి మొత్తం రూ.52.17 లక్షలు అవుతుంది. అంటే మీ డబ్బులు డబుల్ అవుతాయి. ఇక మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 11 శాతంగా వస్తుందని అనుకుంటే అప్పుడు మీరు 10 సంవత్సరాల్లో కోటి రూపాయలు అందుకోవాలంటే నెలకు రూ.46,083 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి విలువ రూ.55.30 లక్షలు అవుతుంది. ఇదే విధంగా వార్షిక రాబడి 10 శాతంగా ఉందని అనుకుంటే మీరు నెలకు రూ.48,817 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టాలి. మీ పెట్టుబడి పదేళ్లలో రూ.58.58 లక్షలు అవుతుంది. ఇక మీకు ఏడాదికి 9 శాతం చొప్పున రాబడి వస్తుందని అంచనా వేస్తే అప్పుడు మీరు నెలకు రూ.51,676 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మీ పెట్టుబడి రూ.62.01 లక్షలు అవుతుంది. ఇక ఏడాదికి 8 శాతం చొప్పున రిటర్న్స్ వస్తే అప్పుడు మీరు నెలకు రూ.54,661 మేర ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంచుకుంటే 8 శాతం నుంచి 12 శాతం మధ్య రాబడులు అంచనా వేస్తే అప్పుడు నెలకు రూ.43,471 నుంచి రూ.54,661 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కీమ్స్ మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. రాబడి తగ్గినప్పుడు పెట్టుబడి పెంచాల్సి వస్తుంది. అలాగే కొన్ని స్కీమ్స్ అంచనాలను మించి రాబడులు ఇస్తాయి. అప్పుడు తక్కువ కాలంలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లభిస్తుంది. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువే. పూర్తి విషయాలు తెలుసుకున్నాకే పెట్టుబడి పెట్టాలి.