తర్వాత భవిష్యత్తులో . ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని క్రీడల్లో కూడా చూపిస్తున్నారని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అధికారి స్పందిస్తూ ఇలాంటి చెప్పడం సులభమే కానీ, ఆచరణలో ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐసీసీపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ, “ఇలాంటి చర్చలు చేయడం సులభం, కానీ తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ప్రధానంగా స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు అభిప్రాయం ఇచ్చాక మాత్రమే తుది నిర్ణయం వెలువడుతుంది” అని స్పష్టం చేశాడు.ఆరంభం నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ డ్రామాతో నిండిపోయింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా, పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రిగా ఉన్న ఏసీసీ ఛైర్మన్‌గా ఉన్న మొహ్సిన్ నక్వీ నుంచి ట్రోఫీ స్వీకరించకుండా నిరాకరించింది. ఈ టోర్నమెంట్‌లో భారత - పాక్ జట్లు మూడు సార్లు ఎదుర్కొనగా.. అన్ని మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పాక్ జట్టుతో షేక్ హ్యాండ్‌కు నిరాకరించారు. తర్వాత సెప్టెంబర్ 21న జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు భారత్‌ను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా 6-0, గన్ సెలబ్రేషన్స్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ భవిష్యత్తులో ఇరు జట్ల మ్యాచ్‌లను తగ్గించాలని ఐసీసీకి సలహా ఇచ్చాడు.అథర్టన్ సూచనపై బీసీసీఐ అధికారి స్పందిస్తూ “ఇలాంటి సలహాలను ఇవ్వడం సులభం, కానీ స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు ఒప్పుకోకపోతే ఏ నిర్ణయాలు తీసుకోవడమైనా కష్టమే. ఈ రోజు పరిస్థితుల్లో, ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుంచి వెనక్కి తగ్గితే, స్పాన్సర్లను ఆకర్షించడం కష్టమవుతుంది” అని తెలిపాడు.సెప్టెంబర్ నెలాఖరును ఆసియా కప్ 2025 ముగిసినప్పటికీ ఇప్పటిదాకా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు ఏసీసీ ట్రోఫీ అందించలేదు. ఆసియా కప్ 2025 ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంది. మొహ్సిన్ నక్వీ సోషల్ మీడియా ద్వారా “భారత్ ట్రోఫీ కావాలంటే, కెప్టెన్ సూర్యకుమార్ దుబాయ్‌కు వెళ్లి స్వీకరించాలి” అని వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ACC సమావేశంలో నక్వీ, బీసీసీఐ ప్రతినిధులైన రాజీవ్ శుక్లా, అశీష్ శెలార్ మధ్య ఉద్రిక్తతలు నమోదయ్యాయి. అయితే, నక్వీ ఎప్పుడూ ట్రోఫీ అందజేస్తారనే విషయానికి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.