హమ్మయ్యా.. అక్కడ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఈరోజు గోల్డ్ రేట్లు ఇవే.. తులం ఎంతంటే

Wait 5 sec.

: మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అలర్ట్. పసిడి ధర ప్రతి రోజు సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఊహించని విధంగా పెరుగుతూ రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతోంది. తాజాగా నమోదైన పసిడి ధర ఆల్ టైం రికార్డ్ గా చెప్పవచ్చు. అమెరికాలో ఔన్స్ గోల్డ్ రేటు 4000 డాలర్ల మార్క్ దాటి ఈరోజు కాస్త వెనక్కి తగ్గింది. దీంతో స్వల్ప ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే అమెరికా షట్‌డౌన్, ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారం భారీగా కొనేలా చేస్తున్నాయి. పసిడిని సురక్షితమైన మార్గంగా ఎంచుకని భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా డాలర్ విలువ 10 శాతం పడిపోయింది. డాలర్ తగ్గడంతో పెరుగుతుంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు తెలుసుకుందాం. అక్కడ తగ్గిన బంగారం ధర..అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 60 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో 4000 మార్క్ నుంచి బంగారం ధర వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు 3990 వద్ద ట్రేడవుతోంది. అయితే, మాత్రం 0.65 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 49.74 డాలర్ల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు.. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.220 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,24,150 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల నగల బంగారం రేటు ఈరోజు తులంపై రూ.200 మేర పెరిగింది. దీంతో మరో కొత్త రికార్డ్ స్థాయికి చేరింది. ఈరోజు 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు రూ.1,13,800 వద్దకు చేరుకుంది. రూ.7000 పెరిగిన వెండి ధరఓ వైపు బంగారం మరో వైపు వెండి పరుగు పందెంలో నువ్వా నేనా అంటూ దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త మైలురాళ్లను తాకుతూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగెడుతున్నాయి. ఈరోజు కిలో వెండి రేటు ఏకంగా రూ.7000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.1,77,000 మార్క్ దాటింది. అయితే, ఢిల్లీ, ముంబయి వంటి ఇతర నగరాల్లో కిలో వెండి రూ.1,67,000 మార్క్ వద్ద ట్రేడవుతుండడం గమనార్హం. పైన పేర్కొన్న పసిడి ధరలు అక్టోబర్ 10వ తేదీన ఉదయం 7 గంటల టైంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు మధ్యాహ్నానికి మారుతుంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి రేట్లు వేరు వేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి.