ఈ ఒక్క స్కీమ్‌తో.. అదానీ, అంబానీ, బిర్లా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు..ఈనెల 17 వరకు ఛాన్స్

Wait 5 sec.

Insight: చాలా మంది పెద్ద కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయాలనుకుంటారు. అందులోనూ దేశీయ అపర కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, బిర్లాలకు చెందిన కంపెనీలవైపు చూస్తుంటారు. అయితే, వాటి స్టాక్స్ కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదు. స్టాక్ మార్కెట్ ద్వారా ఒక్కో కంపెనీ షేరు కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. వాటి పని తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆందోళన చెందాల్సి వస్తుంది. అయితే, అలాంటివేవీ లేకుండా మీరు ఒక్క స్కీమ్ ద్వారా అదానీ, అంబానీ, బిర్లా కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు. సరికొత్త ఫండ్ () లాంచ్ చేసింది. ఐసీఐసీఐ ఎంఎఫ్ తీసుకొచ్చిన ఐసీఐసీఐ ప్రూ కాంగ్లొమెరేట్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఇది సమ్మేళనం థీమ్‌తో వస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ఇది ఒక సెక్టోరల్ లేదా థెమాటిక్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 17, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత యూనిట్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిటైల్ మార్కెట్లో క్రయ విక్రయాలకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. నేతృత్వంలోని గ్రూపులను కాంగ్లోమెరేట్స్ అంటారు. బలమైన ప్రమోటర్లు, వైవిధ్యభరితమైన కార్యకలాపాలతో ఈ వ్యాపార గ్రూపులు నష్టాలు తగ్గించుకోవడానికి, భవిష్యత్తు రంగాలలో విస్తరణను కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను అణ్వేషిస్తుంటాయని ఫండ్ హౌస్ తెలిపింది. దేశంలోని ప్రముఖ వ్యాపార గ్రూప్‌లు దశాబ్దాలుగా తమను తాము తిరిగి ఆవిష్కరించుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొంది. వ్యవస్థీకృత రిటైల్‌ను ప్రారంభించడం, టెలికాం, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రంగాలలోకి ప్రవేశించడం వంటివి ఉన్నట్లు పేర్కొంది. ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందని, ప్రముఖ కంపెనీల్లో ఒకే స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించేందుకే ఈ కొత్త ఫండ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ కాంగ్లొమెరేట్ ఫండ్ మేనేజర్‌గా లలిత్ కుమార్‌ను నియమించినట్లు ఏఎంసీ తెలిపింది. ఈ ఫండ్ బెంచ్ మార్క్ బీఎస్ఈ సెలెక్ట్ బిజినెస్ గ్రూప్స్ ఇండెక్స్ ఉంటుంది. న్యూ ఫండ్ ఆఫర్ సమయంలో కనీస పెట్టుబడి రూ.1000గా నిర్ణయించారు. మార్కెట్లోని వివిధ సెక్టార్లు, మార్కెట్ క్యాప్స్ ఆధారంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల సెక్టోరల్, థెమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. అయితే, ఈ కొత్త ఫండ్ వాటికి చాలా భిన్నంగా ఉంటుందని ఏఎంసీ తెలిపింది.