బిహర్‌లోపై మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు నమిలింది. ఈ అంశానికి సంబంధించిన గణాంకాలు తమవద్ద లేవంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సమాధానం దాటవేశారు. సోమవారం సాయంత్రం (అక్టోబరు 6న) మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఎన్నికల సంఘం... ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘బిహార్‌లోని 7.4 కోట్ల మంది ఓటర్లు ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొని ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం ఉంచారు.. ఈసీ కూడా దానికి ప్రతిఫలంగా అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.. వచ్చే ఎన్నికల్లో బిహర్ ప్రజలు ఉత్సాహాంగా పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని తెలిాపరు. పౌరసత్వానికి సరైన ఆధారాలు చూపడంలో విఫలమై, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అక్రమ వలసదారుల వివరాలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సంబంధిత అధికారుల వద్ద లభ్యమవుతాయని, ఇది వికేంద్రీకృత విధానం కావడంతో అటువంటి ఏర్పాటు చేశామని సీఈసీ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, చేర్పుల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల నమోదు అధికారికి ఉందని ఆయన స్పష్టం చేశారు.అయితే, లో తొలగించిన 65 లక్షల మంది, తుది జాబితాలో తొలగించిన మరో 3.7 లక్షల మంది చనిపోవడం, శాశ్వతంగా వేరే చోటుకు వలస, పౌరసత్వం లేకపోవడం లేదా ఒక కంటే ఎక్కువ చోట్ల నమోదు కావడం వంటి కారణాలతో అనర్హులుగా గుర్తించామని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. ‘‘ఈ జాబితాలు అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో విడుదల చేశాం.. వాటికి సంబంధించిన గణాంకాలను కూడా అందజేశాం.. అందుకే ఈ వివరాలు ఈసీ వద్ద లేవు.. కానీ, ఎన్నికల నమోదు అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్ట్రోల్ అధికారి వద్ద ఉంటాయి’’ అని చెప్పారు. కాగా, సవరించిన జాబితాను విడుదల చేసిన సమయంలో వివిధ వర్గాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించినప్పటికీ.. తొలగించిన విదేశీ ఓటర్ల సంఖ్యను మాత్రం ఎన్నికల కమిషన్ వెల్లడించకపోవడం గమనార్హం. మొత్తం తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో 22 లక్షల మంది చనిపోయినవారు, 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు, 36 లక్షల మంది శాశ్వతంగా వేరేచోటు వలస లేదా నమోదు సమయంలో కనుగొనలేకపోవడం. ఈ 36 లక్షల మందిలోనే అక్రమ విదేశీ ఓటర్లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.