ఆంధ్రప్రదేశ్‌కు కంపెనీలు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి తరలి వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా విశాఖపట్నం మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది.. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వస్తోంది. రైడెన్ ఏకంగా రూ.87,250 కోట్లు భారీ పెట్టుబడితో 1,000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. ఈ ప్రాజెక్టులో మొదటి దశ యూనిట్‌ను రెండేళ్లన్నరలో పూర్తి చేయాలని సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు కానుందని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు.రైడెన్‌ సంస్థ ఉమ్మడి విశాఖట్నం జిల్లాలో మూడు చోట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదినలు చేసింది. మొత్తం 480 ఎకరాల భూమిని రాంబిల్లి అచ్యుతాపురం, అడవివరం, తర్లువాడ క్లస్టర్లలో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అడవివరంలో 120, రాంబిల్ల అచ్యుతాపురంలో 160, తర్లువాడలో 200 ఎకరాలు కావాలని కోరింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, దీనిని విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు తెలిపింది. తర్లువాడలోని దానికి 929 మెగావాట్లు, రాంబిల్లిలోని డేటా సెంటర్‌కు 697 మెగావాట్లు, అడవివరంలోని డేటా సెంటర్‌కు 465 మెగావాట్లు విద్యుత్ అవసరమని సంస్థ తెలిపింది. డేటా సెంటర్ అంటే, కంప్యూటర్లు, సర్వర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకచోట భద్రపరిచి, వాటిని నిరంతరం పనిచేయించేందుకు అవసరమైన వ్యవస్థ. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే, వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు ప్రారంభించి రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్ని కుదిరితే 2028 జులై నాటికి కార్యకలాపాలు మొదలుపెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. రైడెన్‌ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ, సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ. ఇది అమెరికాకు చెందిన గూగుల్‌ ఎల్‌ఎల్‌సీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ‘రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ రైడెన్‌ ఏపీఏసీ సంస్థ, భారతదేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను అందిస్తుంది. రైడెన్‌ సంస్థ, నాస్‌డాక్‌ స్టాక్‌ మార్కెట్‌లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా నమోదైందని ప్రభుత్వానికి తెలియజేసింది. అంటే, ఈ సంస్థ షేర్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికేను రూ.52 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఈ నెలలోనే ప్రారంభోత్సవం కూడా నిర్వహించనున్నారు. అలాగే సిఫీ సంస్థ కూడా డేటా సెంటర్ కాంప్లెక్స్‌ను రూ.16 వేల కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ పరిణామాలతో విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోంది. తాజాగా రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఏఐ పవర్ డేటా సెంటర్ ఆధారిత కంప్యూటర్లకు అవసరమైన విద్యుత్ శక్తిని అందించే భారీ కేంద్రం ఏర్పాటు చేయబోతోంది.