తెలంగాణలో దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నా.. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావాలతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ నెలంతా కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తీవ్ర వడ గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. రానున్న రెండ్రోజులు ఈ జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గడిచిన మూడు రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బహదూర్‌పురా, కిషన్‌బాగ్‌, బండ్లగూడ, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి వంటి ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షం కురిసంది. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నేడు కూడా మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో అక్కడక్కడా తీవ్రమైన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని.. కాస్త ఎండగాను ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా చల్లబడి సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు, చెట్లు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి నగర ప్రజలు, పైన పేర్కొన్న జిల్లాల వాసులు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా, సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.