రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అత్యంత ముఖ్యమైన నోటిఫికేషన్ వెలువడడానికి మార్గం సుగమం అయింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ.. ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దూకుడు పెంచింది. షెడ్యూల్ ప్రకారం.. ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం నాడు నోటిఫికేషన్ విడుదల కానుంది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. నోటిఫికేషన్ విడుదలను ఆపడానికి స్టే జారీ చేయాలని పిటిషనర్లు కోరినప్పటికీ.. న్యాయస్థానం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ తీర్పు ఫలితంగా.. ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగడానికి లైన్ క్లియర్ అయింది. (గురువారానికి) వాయిదా పడింది. ఎన్నికల సంఘం సన్నద్ధతహైకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. తొలుత తమ లీగల్ బృందంతో సమాలోచనలు జరిపిన ఎస్‌ఈసీ.. ఆ వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో నామినేషన్ల స్వీకరణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలుపై కీలక సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు తాము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్లు ఈసీకి నివేదించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్... రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అవుతుంది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలైన తర్వాత.. తదుపరి దశలో సర్పంచ్ , వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల తేదీల ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.