త్వరలోనే కోలుకొని మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వెస్టిండీస్ సిరీస్‌కు ముందు ఇంకా కోలుకోలేకపోవడంతో రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. రానున్న సిరీస్‌లలో కీలకం కానుండటంతో అతని ఫిట్‌నెస్‌పై తాజాగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10 నాటికి పంత్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటింగ్ సమయంలో పాదం విరగడంతో పంత్ టెస్టు క్రికెట్‌కు దూరమయ్యారు. ఆ సిరీస్‌లో పంతఖ 4 టెస్టుల్లో 479 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, మూడు అర్ధశతకాలతో ఆ సిరీస్‌లో భారత జట్టుకు కీలకంగా నిలిచాడు. అయితే మాంచెస్టర్ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్ కుడి పాదాన్ని తాకడంతో పంత్ గాయపడ్డాడు. అయినప్పటికీ, ధైర్యంగా తిరిగి బ్యాటింగ్‌కి వచ్చి జట్టుకు విలువైన రన్స్ అందించాడు.“అక్టోబర్ 10 నాటికి అతను ఆటకు క్లియర్ అవుతారని ఆశిస్తున్నాం. ఇది చాలా దీర్ఘకాల రికవరీ. మెడికల్ టీం ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు” అని ఒక అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకి తెలిపాడు. అదే నివేదిక ప్రకారం, పంత్ ఇప్పటికే డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీతో మాట్లాడి తన రీ ఎంట్రీ ప్రణాళికను వివరించారు. ఆయన అక్టోబర్ 25న ప్రారంభమయ్యే మ్యాచ్‌లతో తిరిగి ఆటలోకి రావాలనుకుంటున్నాడు.“ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే రంజీ మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్ధంగా ఉంటానని పంత్ తెలిపాడు” అంటూ డీడీసీఏ ఉన్నతాధికారి వెల్లడించాడు. ఇక భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కూడా పంత్ స్థితి గురించి స్పందించాడు.“రిషభ్ ఈ సిరీస్‌కు సిద్ధం కాలేదు. కానీ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నాటికి పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. కచ్చితమైన టైమ్‌లైన్ చెప్పలేము కానీ, ఆయన రీటర్న్ చాలా దగ్గర్లోనే ఉంది” అని ఆగార్కర్ తెలిపాడు.వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు రవీంద్ర జడేజాను యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి డిప్యూటీగా నియమించారు. జడేజా ఇటీవల జరిగిన అండర్సన్ - టెండుల్కర్ ట్రోఫీలో 516 పరుగులు, 7 వికెట్లు సాధించి అద్భుతమైన ప్రదర్శన చూపారు. “జడ్డు జట్టు సీనియర్ ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నిరంతరం ప్రదర్శన చూపిస్తున్నాడు. అందుకే అతన్ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాం” అని ఆగార్కర్ చెప్పాడు.