20 నెలల తర్వాత మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్.. ‘ఓజీ’స్‌ ఎంటర్టైన్మెంట్ షురూ..

Wait 5 sec.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విక్టరీ వెంకటేష్.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. #Venky77 #VenkateshXTrivikram అనే వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమా బుధవారం పట్టాలెక్కినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు. అందరికీ ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ తో చేతులు కలిపారు. ది ఓజీస్‌ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరోసారి ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడానికి సెట్స్‌పైకి వచ్చారు'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో వెంకటేష్, త్రివిక్రమ్‌ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు.