చేపల వేటపై తాత్కాలిక నిషేధం.. చేపల రక్షణ కోసం హెలికాప్టర్లు, యుద్ధనౌకలు

Wait 5 sec.

అంటే బంగ్లాదేశ్‌లో యమ గిరాకీ ఉంటుంది. భారీ ధర పలికే ఈ హిల్సా చేపలు అంతరించిపోతున్న తరుణంలో వాటి ఉత్పత్తిని పెంచడానికి.. అదే సమయంలో వాటిని రక్షించేందుకు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో స్థానికంగా హిల్సా చేపలను రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హిల్సా చేపల సంతానోత్పత్తి సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకోసం ఏకంగా చేపలను వేటాడటాన్ని.. వాటిని నిల్వ చేయడం మాత్రమే కాకుండా.. చేపల రవాణా, విక్రయాలపైనా కొంత కాలం నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హిల్సా చేపల రక్షణ కోసం విధించిన ఈ ఆంక్షలు.. క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలు అవుతున్నాయో లేదో చూసేందుకు స్పెషల్‌గా ఓ భారీ ఆపరేషన్‌ను చేపట్టడం గమనార్హం. ఈ క్రమంలోనే హిల్సా చేపల సెక్యూరిటీ కోసం రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ నేవీ, ఎయిర్‌ఫోర్స్.. వార్‌షిప్‌లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో విస్తృత నిఘా చేపట్టాయి.సాధారణంగా బంగ్లాదేశ్‌లో హిల్సా చేపలకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. అందుకే వాటిని సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం రకరకాల చర్యలను తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా హిల్సా చేపల సంతానోత్పత్తి సమయంలో ఇలాంటి కీలక కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హిల్సా చేపల వేటపై అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు (3 వారాల పాటు) నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ మత్స్య, పశుసంవర్ధక శాఖ ఇటీవలె నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఈ నిషేధాన్ని పూర్తిస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు బంగ్లాదేశ్ అధికారులు స్థానికంగా అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పోస్టర్లు, కరపత్రాలు పంచడమే కాకుండా.. మార్కెట్లలో లౌడ్‌స్పీకర్లతో ప్రచారం చేయించారు.ఇవి మాత్రమే కాకుండా.. స్థానిక పోలీసులతో కలిసి బంగ్లాదేశ్ నేవీ, కోస్ట్‌గార్డ్‌, వైమానిక దళాలు భారీ ఎత్తున ఆపరేషన్‌ను ప్రారంభించాయి. సముద్ర తీర ప్రాంతాల్లో 17 వార్‌షిప్‌లు, పెట్రోలింగ్‌ హెలికాప్టర్లను రంగంలోకి దించాయి. నదులు, ప్రాదేశిక సముద్ర జలాల్లో డ్రోన్లతో గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. సముద్రంలోకి స్థానిక, విదేశీ మత్స్యకారులు వెళ్లకుండా ఉండేందుకే ఈ చర్యలన్నింటినీ తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. ఇక ఈ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఉల్లంఘించిన 100 మందిని గత రెండు రోజుల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. పటువాఖాలీలో దాదాపు 80 వేల మత్స్యకారులు ఉండగా.. ఈ చేపల వేటను నిషేధిస్తూ ఉన్న కాలంలో వారికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని అధికారులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ హిల్సా చేపలకు బంగ్లాదేశ్‌తోపాటు మన దేశంలోనూ భారీ డిమాండ్‌ ఉంటుంది. కోల్‌కతా మార్కెట్‌లో కిలో హిల్సా ధర దాదాపు రూ.1000 నుంచి రూ.2 వేలు పలుకుతుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో పుట్టే ఈ హిల్సా చేపలు చాలా ఫేమస్. అందుకే వీటికి పద్మాపులస అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ హిల్సా చేపలకు ఉన్న భారీ దృష్ట్యా 2012 నుంచి వీటిని ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ.. దుర్గాదేవీ నవరాత్రుల వేళ కొన్ని రోజుల పాటు మాత్రం ఈ ఆంక్షలను కాస్త సడలించి.. పరిమితంగా భారత్‌కు ఈ హిల్సా చేపలను ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది దసరా సమయంలో 1200 టన్నుల హిల్సా చేపలను భారత్‌కు బంగ్లాదేశ్ ఎగుమతి చేసింది.