TCS Quarterly Bonus: దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ ప్రకటించింది. కంపెనీ లాభం, ఆదాయం మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయాయి. లాభం, ఆదాయం కిందటేడాది ఇదే త్రైమాసికంతో చూస్తే.. స్వల్పంగా మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఇప్పుడు తమ ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. బోనస్ మాత్రం సమీక్షా త్రైమాసికానికి సంబంధించి.. పూర్తి స్థాయిలో చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇక్కడ అంతకుముందు త్రైమాసికాల్లో చెల్లించిన దాని కంటే ఎక్కువగానే ఈసారి బోనస్ అందించనున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్. 'మా సంస్థలో పనిచేస్తున్న అందరికీ త్రైమాసిక బోనస్ అందిస్తాం. అయితే కొంత మంది కొత్తగా చేరిన వారికి మాత్రం ఉండకపోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే.. అందరికీ చెల్లిస్తాం. జూనియర్ స్థాయి ఉద్యోగులకు మేం 100 శాతం బోనస్ చెల్లిస్తున్నాం. ఈసారి కూడా అదే కొనసాగుతుంది. ఇక సీనియర్ స్థాయి ఉద్యోగులకు కూడా బాగానే చెల్లిస్తున్నాం. ఇది మళ్లీ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారంగా ఉంటుంది." అని సుదీప్ వెల్లడించారు. >> టీసీఎస్ కొంత కాలంగా దాదాపు ప్రతి త్రైమాసికంలోనూ సుమారు 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే చెల్లింపులు చేస్తూ వస్తోంది. ఈసారి ఫలితాల్లో కాస్త నిరాశపర్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో బోనస్ అందించనున్నట్లు ప్రకటించడం విశేషం. టీసీఎస్ ఉద్యోగుల్లో.. గ్రేడ్ల ఆధారంగా విభజన ఉంటుంది. ట్రైనీలు వై లెవెల్‌లో ఉంటారు. ఆ తర్వాత సిస్టమ్ ఇంజినీర్స్ (C1) ఉంటారు. తర్వాత C2, C3, C4 ఇలా ఉంటారు. C3 అంతకంటే ఎక్కువ బ్యాండ్లలో సిబ్బందిలో సీనియర్ మేనేజర్లు, వ్యాపార యూనిట్ హెడ్స్ ఉంటారు. >> సమీక్షా త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 12,075 కోట్లుగా వచ్చింది. ఇది కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.39 శాతం ఎక్కువ. ఆదాయం చూస్తే రూ. 65 వేల కోట్లకుపైగా నమోదైంది. ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ సుమారు 18,500 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో గమనార్హం. ఇదే గందరగోళం సృష్టిస్తుంది. ప్రతి త్రైమాసికంలోనూ టీసీఎస్.. ఉద్యోగుల సంఖ్య, సిబ్బంది వలసల రేటు గురించి ప్రకటనలు విడుదల చేస్తుంటుంది. ఈసారి వాటి జోలికి మాత్రం వెళ్లలేదు.