పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష.. హనీమూన్‌ కూడా ప్లాన్ చెయ్యండి అంటూ పోస్ట్..

Wait 5 sec.

సౌత్ స్టార్ హీరోయిన్లలో త్రిష కృష్ణన్ ఒకరు. గత రెండు దశబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే ఎప్పుడూ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేకసార్లు ఆమె వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మరోదారి ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చండీగఢ్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో ఆమె మ్యారేజ్ జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై త్రిష తాజాగా స్పందించారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు.“నాకోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న జనాలను నేను ప్రేమిస్తాను. హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా” అంటూ త్రిష సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్తలను పరోక్షంగా ఖండించింది. నిజానికి 2015లో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకూ వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మరి త్వరలోనే పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.