ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్ విభాగాల్లో ఈసారి నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించగా.. తాజాగా కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీలకు.. రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ బహుమతి దక్కింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధి కోసం విశేష కృషి చేయగా.. అందుకు ఈ నోబెల్‌కు ఎంపికయ్యారు.ఇక సోమవారం రోజున వరించింది. రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారు అనే దానిపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ బహుమతి వరించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ వెల్లడించింది.ఆ తర్వాత మంగళవారం రోజున లభించింది. క్వాంటం మెకానిక్స్‌పై చేసిన విస్తృత పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.