తిరుపతిలోని విధించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన కమిషన్.. రూ.15 లక్షలు జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు, ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవటం, విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు, విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు నిలిపివేయడం వంటి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే వసూలు చేసిన రూ.26 కోట్లు చెల్లించాలని సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీ చేసి.. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. *ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో - ఛాన్సలర్ ఈ వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు మంచు విష్ణు. మీడియాలో వస్తున్న నిరాధార వార్తలను నమ్మవద్దని మంచు విష్ణు కోరారు. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి చేసినవి కేవంలం సిఫార్సులు మాత్రమేనన్న మంచు విష్ణు.. తాము ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరుపుతోందని.. ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా మోహన్ బాబు యూనివర్సిటీకి అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కాదని.. ఏపీ ఉన్నత విద్యా కమిషన్ దీనిని పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులు సరికాదని మోహన్‌బాబు యూనివర్సిటీ గట్టిగా విశ్వసిస్తోందని మంచు విష్ణు ప్రకటనలో వెల్లడించారు. * విచారణ సమయంలో తాము పూర్తిగా సహకరించామని.. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తన నివేదికలో పేర్కొందన్న మంచు విష్ణు.. దానిని బట్టి ఎలాంటి తప్పు జరగలేదనే విషయం తెలుస్తుందన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా దీనిని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు, మీడియాకు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ఛాన్సలర్ మోహన్ బాబు మార్గదర్శకత్వంలో విద్యార్థులకు సమగ్ర విద్యను అందించి మరింత శక్తివంతం చేసే ప్రయత్నం కొనసాగిస్తామని ప్రకటనలో వెల్లడించారు.