ఇన్నాళ్లు ఇది తెలియక ట్రైన్‌లో లోయర్ బెర్తుల అవకాశం కోల్పోతున్నాం.. సింపుల్‌గా చేసుకోండిలా..

Wait 5 sec.

వృద్ధులు లేదా శారీరక ఇబ్బందులు ఉన్నవారు రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు పై బెర్తులు కేటాయిస్తారేమోనని కలత చెందుతుంటారు. అలాంటి ప్రయాణీకుల సౌకర్యార్థం భారతీయ రైల్వేశాఖ రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు, రిజర్వేషన్ కోటాను అమలు చేస్తోంది. రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో వయసు పైబడినవారు, గర్భిణులు.. 45 ఏళ్లు దాటిన మహిళల కోసం ప్రత్యేక కోటా అమలులో ఉంది. ఈ నిబంధనల ప్రకారం.. వీరికి లోయర్ బెర్తు కేటాయించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కోచ్‌లో బెర్తుల కేటాయింపు వివరాలు.. వయోవృద్ధులకు, గర్భిణులకు లోయర్ బెర్త్‌ల కేటాయింపు ప్రతి కోచ్‌లో ఈ విధంగా ఉంటాయి. స్లీపర్‌ క్లాస్‌లో.. ప్రతి కోచ్‌లో సుమారు ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు ఉంటాయి. ఏసీ త్రీ-టైర్‌లో.. ప్రతి కోచ్‌లో సుమారు నాలుగు నుంచి ఐదు దిగువ బెర్తులు ఉంటాయి. ఏసీ టూ-టైర్‌లో.. ప్రతి కోచ్‌లో సుమారు మూడు నుంచి నాలుగు దిగువ బెర్తులు ఉంటాయి. టికెట్ బుకింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. టికెట్ రిజర్వేషన్ సమయంలోనే ప్రయాణీకులు లోయర్ బెర్తు కోరుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టికెట్ బుక్ చేసే సమయంలో సంబంధిత వివరాలను నమోదు చేసి, ‘లోయర్ బెర్తు కోటా’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసే సమయంలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే, కోటా పరిమితంగా ఉంటుంది కాబట్టి.. చివరి నిమిషంలో బుక్ చేసుకునే వారికి ఇది లభించకపోవచ్చు. అందుకే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. స్టేషన్లలో సహాయక సదుపాయాలు.. రైల్వే స్టేషన్లలో కూడా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు సులభతర ప్రయాణం కోసం అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందులో వీల్‌చైర్లు ఒకటి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌తో సహా దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో వీల్‌చైర్లు అందుబాటులో ఉంటాయి. విధుల్లో ఉన్న టికెట్ కలెక్టర్‌కు సమాచారమిచ్చి వీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చు. సికింద్రాబాద్, కాచిగూడ వంటి రద్దీ గల ముఖ్య స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లను కూడా రైల్వే ఏర్పాటు చేసింది. వీటి సహాయంతో ప్రయాణీకులు తాము ఎక్కవలసిన బోగీ వద్దకు సులువుగా చేరుకోవచ్చు. వయోవృద్ధులు, వైకల్య బాధితులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరొక ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా ద.మ. రైల్వే పరిధిలోని 119 స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్లలో లైసెన్స్‌డ్ కూలీలు (పోర్టర్లు) కూడా ప్రయాణీకులకు సామాన్లు మోయడంలో సహాయపడతారు. వారి నిర్ణీత ఛార్జీలు చెల్లించి ఈ సౌకర్యం పొందవచ్చు.