సాయంకాలం ఎంటెక్ చదువులు.. మంచి ఛాన్స్.. త్వరపడండి.. దరఖాస్తు గడువు ముగుస్తోంది..

Wait 5 sec.

ఉన్నత చదువులు చదవాలని మనలో చాలా మందికి ఉంటుంది. కానీ వివిధ కారణాల వలన కుదరకపోవచ్చు. కొంతమందికి ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు ఇలా ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉంటారు. భుజాల మీద ఉన్న బాధ్యతలతో ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పని స్థితి. కానీ మనసులో మాత్రం ఉన్నత చదువులు చదువుకోవాలని.. ఎంటెక్ పూర్తి చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి ఆంధ్రా విశ్వవిద్యాలయం మంచి అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం చేసుకుంటూనే ఎంటెక్ చదివే అవకాశం కల్పిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉద్యోగంచేసుకునేవారు.. సాయంత్రం సమయంలో ఎంటెక్ చదివేందుకు ఇప్పుడు అవకాశం కల్పిస్తోంది.. ఇప్పటికే దరఖాస్తులు కూడా మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఏయూ అధికారులు సూచిస్తున్నారు. * అర్హతలు, కోర్సుల వివరాలు..అయితే సాయంకాలం వేలల్లో ఎంటెక్ చదివేందుకు అవకాశం కల్పిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ.. అందుకు కొన్ని అర్హతలను నిర్దేశించింది. సంబంధిత కోర్సుల్లో బీటేక్ చదివి ఉండాలి. అలాగే స్థానికంగా ఉద్యోగం చేస్తున్నవారే ఇందుకు అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కెమికల్, రాడార్‌ అండ్‌ మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్, పవర్‌ ఎలక్ట్రానిక్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్. ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్, జియో ఇంజినీరింగ్, రిమోట్‌ సెన్సింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ వంటి కోర్సులలో ఎంటెక్ చదివేందుకు ఏయూ అవకాశం కల్పిస్తోంది. *దరఖాస్తు వివరాలు..ఆసక్తి, అర్హత ఉన్న వ్యక్తులు.. అక్టోబర్ 15వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. అక్టోబర్ 17వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కోర్సు పూర్తి అయిన అనంతరం పరీక్షలు రాసేందుకు కూడా 75 శాతం హాజరు తప్పనిసరి. ఫీజును 75 వేల రూపాయలుగా నిర్ణయించారు. *మరిన్ని వివరాలకు audoa.andhrauniversity.edu.in సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే దరఖాస్తులను డైరెక్టర్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్, పెదవాల్తేరు, విశాఖపట్నం-530017 అనే అడ్రస్ పంపాలని సూచిస్తున్నారు.