IND vs WI: నేటి నుంచి భారత్ - వెస్టిండీస్ రెండో టెస్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా!

Wait 5 sec.

లో భాగంగా ఇవాల్టి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మొదటి మూడు రోజుల్లోనే ఫలితం రాగా.. అయినా ఐదు రోజులు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లు రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించగా.. టీమిండియా పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్‌ కూడా రాణించారు. రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించగా, రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని వెస్టిండీస్ చూస్తోంది. మరోవైపు ఈ టెస్టును కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తోంది. వరల్డ్ టెస్ ఛాంపియన్ షిప్ 2025 -27లో భారత్‌ పాయింట్లు మెరుగు పరుచుకోవాలంటే ఈ టెస్టులో భారీ విజయం సాధించాల్సిందే. అహ్మదాబాద్‌లో ఆడిన టీమిండియా జట్టులో మార్పులు ఉండే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. సాయి సుదర్శన్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 147 పరుగులు మాత్రమే చేయడంతో విమర్శలు వస్తున్నాయి. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం సుదర్శన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నాడు.“ప్రతి మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరు సెంచరీ చేయలేరు. యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాలి. వాళ్ల సామర్థ్యం చూడటానికి ఓపిక కావాలి” అని గిల్ చెప్పాడు. ఆంధ్ర యువ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చే అవకాశం ఉంది.రెండో టెస్టులో తాము పుంజుకుంటామని కెప్టెన్ రోస్టన్ ఛేజ్ నమ్మకం వ్యక్తం చేశాడు. మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలని.. అది ఢిల్లీ టెస్టుతోనే ప్రారంభం అవుతుందన్నాడు. “మేము ఇప్పుడు దిగజారిన దశలో ఉన్నాం. కానీ, మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలి. అది ఇప్పుడే కావచ్చు” అని ఛేజ్ అన్నాడు. ఇక విండీస్ ప్లేయింగ్ 11లో జెడియా బ్లేడ్స్ చేరే అవకాశం ఉంది. టీమిండియా ప్లేయింగ్ 11 అంచనాశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.వెస్ట్‌ఇండీస్ ప్లేయింగ్ 11 అంచనాజాన్ క్యాంప్‌బెల్, టాగ్నరైన్ చంద్రపాల్, అలిక్ అథనేజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), షై హోప్, జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియర్, జోమెల్ వారికాన్, జోహాన్ లైన్/జెడియా బ్లేడ్స్, జేడెన్ సీల్స్.