ఆఖరి 5 ఓవర్లలో విధ్వంసం.. 52 పరుగుల్లో 50 డి క్లార్కే బాదేసింది! సఫారీ బ్యాటర్ సిక్సర్లకు వైజాగ్ ఫ్యాన్స్ ఫిదా!!

Wait 5 sec.

లో సాధించింది. అప్పటి వరకూ టీమిండియా చేతుల్లో ఉన్న విజయం ఆఖరి ఐదు ఓవర్లలో మారిపోయింది. బ్యాటింగ్‌ చేస్తుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ప్లేయర్లు కూడా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయారు. గ్రౌండ్‌కి నలువైపులా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. భారత్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ డి క్లార్క్ బ్యాటింగ్‌కి వైజాగ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సఫారీ కెప్టెన్ లారా వోల్వర్ట్ నిలకడగా ఆడి 70 పరుగులు చేసి అవుటైన తర్వాత మ్యాచ్‌ బాధ్యతలను క్లో ట్రయన్ - నాదిన్ డి క్లార్క్ తమ భుజాలపై వేసుకున్నారు. మరో వికెట్ పడకుండా నిదానంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఆఖరి పది ఓవర్లలో కూడా తొందర పడకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఆఖరి ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 52 పరుగులు కావాల్సి ఉంది. క్లో ట్రయన్ 64 బంతుల్లో 49, డి క్లార్క్ 36 బంతుల్లో 34 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. అమన్‌జోత్ కౌర్ వేసిన 46వ ఓవర్‌లో డి క్లార్క్ హిట్టింగ్ ప్రారంభించింది మొదటి రెండు బంతుల్లోనే సిక్స్, ఫోర్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, అదే ఓవర్‌లో స్టాండర్డ్ బ్యాటర్ క్లో ట్రయన్ 49 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. అదే సమయంలో డి క్లార్క్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఇచ్చిన ఓ కష్టమైన క్యాచ్‌ను స్మృతి మంధాన జారవిడవడం భారత్‌ ఓటమికి ఒక కారణమైంది.ఇక మ్యాచ్ టీమిండియాదే అనుకున్న సమయంలో డి క్లార్క్ రెచ్చిపోయి రిజల్ట్‌నే మార్చేసింది. ట్రయన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఖాకాకి కేవలం మూడు బంతులు మాత్రమే ఆడే అవకాశం ఇచ్చి మిగతా ఇన్నింగ్స్ మొత్తం ఒక్కతే ఆడింది. ఫీల్డర్ల మీదుగా బౌండరీలు బాదుతూ టీమిండియాకు చుక్కలు చూపెట్టింది. ఏకంగా ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి మ్యాచ్‌ని ఫినిష్ చేసింది. రెండు ఓవర్లకు 12 పరుగులు చేయాల్సి రాగా.. ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది 7 బంతులు మిగిలుండగానే సౌతాఫ్రికాను గెలిపించింది. ఆఖరి 5 ఓవర్లలో 52 పరుగులు కావాల్సి ఉంటే డి క్లార్క్ ఒక్కతే 50 పరుగులు చేయగా.. ఆఖరి 18 బంతుల్లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 50 పరుగులతో రికార్డ్ ఇన్నింగ్స్ ఆడింది.