మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫంకీ'. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. అనుదీప్ మార్క్ కామెడీ డైలాగ్స్ తో కూడిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.