ఎమర్జెన్సీగా డబ్బులు కావాలా.. వడ్డీ లేని ముఖ్యమైన రుణాలు ఇవే.. రైతులకు కూడా..

Wait 5 sec.

: ఇటీవలి కాలంలో అవసరాలు పెరుగుతున్న క్రమంలో.. ఖర్చుల్ని తట్టుకునేందుకు చాలా మంది లోన్లు తీసుకుంటున్నారు. అయితే.. ఎక్కడ లోన్ తీసుకున్నా దానికి మనం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అయితే.. మీరు కొన్ని ప్రత్యేక ఆర్థిక లావాదేవీలు, నిర్దిష్ట పథకాల కింద వడ్డీ లేకుండానే డబ్బు ఉపయోగించుకోవచ్చు. ఈ .. కొన్ని నిబంధనలు, నిర్దిష్ట కాల వ్యవధి వరకు ఉన్నప్పటికీ.. ఆర్థికంగా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇందులో ఏమేం ఉన్నాయి.. మనకు ఎలా ఉపయోగపడతాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. >> క్రెడిట్ కార్డ్స్: మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు.. ఇక్కడ గ్రేస్ పీరియడ్ వరకు మీకు వడ్డీ రహిత రుణం కిందికే వస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్స్ నుంచి వస్తువులు లేదా సేవల్ని కొనుగోలు చేసిన తేదీ నుంచి గరిష్టంగా 50 రోజుల వరకు మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ అప్పటివరకు ఎలాంటి వడ్డీ పడదు. గడువు తేదీలోపు కట్టేస్తే.. పైసా వడ్డీ కూడా పడదు. అయితే.. ఇక్కడ గడువు దాటిన తర్వాత చెల్లించకపోతే.. వడ్డీ ఎక్కువ పడుతుంది. ఇంకా పెనాల్టీ కూడా విధిస్తారు. >> నో కాస్ట్ ఈఎంఐ: ప్రస్తుతం రిటైల్, ఇ- కామర్స్ సెక్టార్‌లో వడ్డీ లేకుండా రుణం పొందే ఆప్షన్లలో దీని గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. మీరు స్మార్ట్ ఫోన్, ఫర్నీచర్, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి ఖరీదైనవి కొనుగోలు చేస్తే.. ఆ మొత్తం ఖర్చును వడ్డీ అదనంగా ఏం లేకుండా.. ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా పండగ స్పెషల్ ఆఫర్స్ లేదా డీలర్స్/రిటైలర్స్ ప్రమోషనల్ డీల్ వంటి సమయాల్లో ఈ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. దీని కాలపరిమితి కనీసం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉండొచ్చు. అయితే ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐ అని ఉన్నా.. కొన్ని సార్లు హిడెన్ ఛార్జీల రూపంలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ఉంటాయి. >> రైతులకు ప్రభుత్వ రుణాలు: రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు.. ఇంకా వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించేందుకు కొన్ని ప్రభుత్వ పథకాల కింద వడ్డీ లేని లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ నిధుల్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కొన్ని అర్హతలు, నిబంధనలు వంటివి ఉంటాయి. >> కంపెనీలు కూడా: తమ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు కొన్ని పెద్ద కంపెనీలు కూడా లేదా అడ్వాన్సులు అందిస్తుంటాయి. ఇవి విద్య లేదా వైద్యం, ఇతర అత్యవసరపరిస్థితుల్లో ఆదుకుంటాయి. ఇక్కడ ఎలాంటి వడ్డీ లేకుండా ఉద్యోగి జీతం నుంచి నిర్ణీత వ్యవధిలో సంస్థ.. తిరిగి ఉపసంహరించుకుంటుంది. >> విద్య కోసం: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమాల కింద వడ్డీ రహిత విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కొన్ని ఎన్‌జీఓలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా వీధి వ్యాపారుల కోసం, చిన్న వ్యాపారాలు చేసే వారికి, మహిళా సంఘాలకు జీరో ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తున్నాయి.