: కొనసాగుతోంది. ఇప్పటివరకు మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ రంగాల్లో ఇప్పటివరకు నోబెల్ విజేతలను ప్రకటిస్తున్నారు. మరియా కొరినా మచాడోకు ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి.. దాంతో పారుట నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అరుదైన గౌరవం లభించింది. ఇక మరియా కొరినా మచాడోను వెనిజులా ఉక్కు మహిళ అని కూడా పిలుచుకుంటారు. ఇక ఆమె వెనిజులా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు.స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.