నోబెల్ విజేతలకు ప్రైజ్‌మనీ.. బంగారు మెడల్ బరువు, ఆసక్తికర విషయాలు

Wait 5 sec.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం ప్రారంభమైన ఈ నోబెల్ విజేతల ప్రకటన.. ఈనెల 13వ తేదీతో పూర్తి కానుంది. ఈనెల 6వ తేదీన వైద్య విభాగంతో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన.. ఆ తర్వాత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం వంటి రంగాల్లో విజేతల పేర్లను ప్రకటించగా.. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో ముగ్గురు చొప్పున విజేతలు ఉండగా.. సాహిత్యం, శాంతి బహుమతికి ఒక్కొక్కరు ఎంపిక అయ్యారు. ఈనెల 13వ తేదీన చివరగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేరును ప్రకటించనుండగా.. వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నోబెల్ బహుమతి చరిత్రనోబెల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్ ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతీ సంవత్సరం ఈ నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించారు. ఆయన జ్ఞపకార్థం ఆల్ఫ్రెడ్ నోబెల్ ట్రస్ట్‌ ద్వారా 1901 నుంచి ఈ నోబెల్ బహుమతులను ప్రకటించి అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ఈ నోబెల్ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇక ఈ నోబెల్ పురస్కారం దక్కించుకున్న గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.33 కోట్లు )నగదు అందుతుంది.మొత్తం 6 రంగాల్లో విజేతలుఇక ఈ నోబెల్ బహుమతులను మొత్తం ఆరు విభాగాల్లో ప్రకటిస్తున్నారు. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్‌, శాంతి, ఎకనామిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుత కృషి చేసిన వారికి ఏటా ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజున అంటే డిసెంబర్‌ 10వ తేదీన విజేతలకు ఈ నోబెల్ పురస్కారాలను అందజేస్తారు. నోబెల్‌ బహుమతులు గెలుచుకున్నవారికి పురస్కారంతోపాటు బంగారు పతకం, డిప్లొమా సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు.ఇక నోబెల్‌ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్‌ శిల్పి గుస్తాన్‌ విజెలాండఖ.. స్వీడిష్‌కి చెందిన ఎరిక్ లిండ్‌బర్గ్ సహకారంతో తయారు చేశారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1902లో అవార్డు ప్రదానోత్సవానికి ఉపయోగించారు. మొదట ఈ పతకాన్ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేసేవారు. దాని బరువు 192 గ్రాములుగా ఉండేది. కానీ ఆ తర్వాత.. 1980లో దానికి కొన్ని మార్పులు చేశారు. 18 క్యారెట్ల బంగారంతో పతకాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఇక దాని బరువును 192 గ్రాముల నుంచి 196 గ్రాములకు పెంచారు. దాని వ్యాసం 6.6 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఇక ఆ పతకం ముందు భాగంలో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ బొమ్మను చెక్కి ఉంచుతారు. ఆ బొమ్మ చుట్టూ నోబెల్‌ పేరు.. ఇతర వివరాలను పొందుపరుస్తారు. ఇక దాని వెనుక భాగంలో ముగ్గురు వ్యక్తులు హగ్ చేసుకుంటున్నట్లు ఉంటుంది.ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని అంటే అప్పట్లోనే 31 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.29 కోట్లను సురక్షితమైన సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టాలని వీలునామా రాశారు. దీని విలువ ఇప్పుడు 2.2 బిలియన్ స్వీడిష్ క్రోనర్లు అంటే మన కరెన్సీలో రూ.2 వేల కోట్లకుపైనే ఉంటుంది. ఆ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏటా ఈ నోబెల్ బహుమతులుగా ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ వెల్లడించారు. ఇక ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి 244 మంది వ్యక్తులు.. 94 సంస్థలతో సహా మొత్తం 338 నామినేషన్లు రాగా.. వెనెజులా ఎంపీ, హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడోకు అదృష్టం వరించింది.