హైదరాబాద్ IT ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే, TGSRTC ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన

Wait 5 sec.

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను విస్తరించాలని టీజీఎస్‌ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఈ ప్రయత్నంలో భాగంగా త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ కొత్త బస్సులు కూడా అందుబాటులోకి వస్తే ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుందని భావిస్తున్నారు.ఐటీ ఉద్యోగులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనపై టీజీఎస్‌ఆర్టీసీ, అసోచామ్ (ASSOCHAM), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (TFMC) సంయుక్తంగా మంగళవారం ఓ సమావేశాన్ని నిర్వహించాయి. హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా క్యాంపస్‌లో జరిగిన ఈ సమావేశంలో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ వాహనాల వల్ల ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. దీనికి ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ఒక్కటే పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.ఐటీ సంస్థలకు బస్సులు అద్దెకు సౌకర్యవంతంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి టీజీఎస్‌ఆర్టీసీ మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సజ్జనార్ తెలిపారు. ఐటీ కంపెనీలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజా రవాణా వాడకం వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చునని చెప్పారు. ప్రతి ఐటీ సంస్థ కూడా ప్రజా రవాణాను ప్రోత్సహించాలని, ఉద్యోగులకు దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. ప్రజా రవాణాను వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం గురించి ఆలోచించాలని ఆయన ఐటీ సంస్థల ప్రతినిధులను కోరారు.ఈ సమావేశంలో ఐటీ కారిడార్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఐటీ సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోచామ్ సౌతర్న్ సెక్టార్ కో చైర్మన్ కృష్ణ ఎదుల, టీఎఫ్‌ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మదాల, టెక్ మహీంద్రా హెచ్‌ఆర్ హెడ్ వినయ్ అగర్వాల్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.