ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త కార్డుల్ని రేషన్ షాపుల్లో డీలర్ సాయంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేశారు. తాజాగా ప్రభుత్వం మరీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇంటి దగ్గరే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి షాపులు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపీలో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్‌లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయంతో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.ప్రజలు వారి కోసం ఎవరిని సంప్రదించాలి.. వారి రేషన్ షాప్ నెంబర్‌కు మ్యాప్ చేయబడిన సచివాలయం ఉద్యోగి వివరాల కొరకు చేయాలని ఆదేశించారు. 1. మీ జిల్లా 2. మీ మండలం 3. మీ సచివాలయం 4. మీ రేషన్ షాప్ ఐడి తోమీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేస్తే.. అప్పుడు రేషన్ షాప్ కి ట్యాగ్ చేయబడిన ఉద్యోగ వివరాలు కనపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రేషన్ షాపుల్లో నెలలో మొదటి 15 రోజుల్లోనే సరుకులు తీసుకోవాలి. ఇప్పుడు ఆ గడువును ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వం రేషన్ పంపిణీ విషయంలో ప్రజలకు వెసులుబాటు కల్పించింది. రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకునేందుకు ఎక్కువ సమయం ఇచ్చింది.. నెల మొత్తం రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్లో గోధుమ పిండి కూడా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.