NFO: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బరోడా బీఎన్‌పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్ () మరో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. బరోడా బీఎన్‌‍పీ పరిబాస్ బిజినెస్ కాంగ్లోమెరేట్స్ ఫండ్ () పేరుతో లాంచ్ చేసింది. దేశంలోని దిగ్గజ బిజినెస్ గ్రూప్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని ఈ ఫండ్ కల్పిస్తోంది. దీని ద్వారా టాటా, బిర్లా, అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), వైవిధ్యమైన పోర్ట్ ‌ఫోలియోను నిర్మించుకునేందుకు ఈ కొత్త ఫండ్ అవకాశం ఇస్తోంది. భారతదేశంలో ఉన్న గ్రూపులుగా కాంగ్లోమేరేట్‌లను గుర్తిస్తారు. ప్రమోటర్లు నాయకత్వం వహిస్తారు లేదా నియంత్రిస్తారు. వివిధ రంగాలు లేదా పరిశ్రమలలో కనీసం రెండు లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంటాయి. బరోడా బీఎన్‌పీ బరిబాస్ తీసుకొచ్చిన ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైపోయింది. సెప్టెంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎన్ఎఫ్ఓలో డిపాజిట్ చేసిన వారికి యూనిట్లు కేటాయించిన 5 రోజుల్లోనే ఈ స్కీమ్ క్రయ విక్రయాలకు రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ బీఎస్ఈ సెలెక్ట్ బిజినెస్ గ్రూప్స్ ఇండెక్స్ ఉంటుంది. ఇది కనీసం 4 పెద్ద గ్రూప్ కంపెనీల్లో ఇన్వస్ట్ చేస్తుంది. ఒక్కో గ్రూప్‌ కంపెనీల్లో గరిష్ఠంగా 25 శాతం పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్‌ని జితేంద్ర శ్రీరామ్, కుషాంత్ అరోరా నిర్వహిస్తున్నట్లు బరోడా బీఎన్‌పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. కంపెనీల విలీనం వంటి కార్పొరేషన్ నిర్ణయాల ద్వారా అదనపు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుందని జితేంద్ర శ్రీరామ్ అన్నారు. ఈ స్కీమ్ లాంచ్ చేయడం ద్వారా దేశంలోని దిగ్గజ వ్యాపార గ్రూప్స్‌లో కొంత వాటా కలిగి ఉండేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించినట్లు బరోడా బీఎన్‌పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. మిగిలిన 0-20 శాతం ఫండ్స్‌ని గ్రూప్ సంస్థలు కాకుండా ఇతర కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది. లేదా డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకేసారి లంప్‌సమ్ పెట్టుబడి పెట్టాలనుకుంటే కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది. ఆ తర్వాత రూ.1000 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిప్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.