కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్‌కే డకౌట్.. గోయెంకా ఎక్కడా అని వెతికిన కెమెరాలు!

Wait 5 sec.

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ - మధ్య ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2024లో రాహుల్‌ని మీద గోయెంకా ఫైర్ అయిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారీ ఈ కాంబినేషన్ మాత్రం హైలెట్‌గానే నిలుస్తుంది. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని లక్నోకి బ్యాటింగ్ ఇచ్చింది. ఢిల్లీ తరఫున ఉన్న వరల్డ్‌క్లాస్ బౌలర్లు లుంగి ఎంగిడి, నటరాజన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లక్నో ప్లేయర్లకు చుక్కలు చూయించి.. కేవలం 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేశారు. 142 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీకి మొహమ్మద్ షమీ మొదటి బంతికే షాక్ ఇచ్చాడు. లక్నో మాజీ కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తొలి బంతికే షమీ పెవిలియన్‌కు పంపాడు. షమీ వేసిన ఔట్ స్వింగర్‌ను షాట్ ఆడే ప్రయత్నంలో ఆఫ్ సైడ్ పాయింట్ మీదుగా బౌండరీ వద్ద క్యాచ్‌గా అవుటయ్యాడు. దాంతో తొలి బంతికే వికెట్ పడటంతో లక్నో ప్లేయర్లంతా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. అయితే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మాత్రం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఎక్కడ ఉన్నాడంటూ కెమెరాలు పెట్టి వెతికారు. ఆ సమయంలో గోయెంకా రియాక్షన్ చూడాలని చాలా మంది ప్రయత్నించారు. చివరగా జస్ట్ స్మైల్ ఇస్తూ గోయెంకా కనిపించిన ఫొటో ఒకటి మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్‌లో కనిపించింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కేవలం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కేఎల్ రాహుల్, కెప్టెన్ అక్షర్ పటేల్ ఫస్ట్ బంతికే వికెట్లు కోల్పోయారు. పాతుమ్ నిస్సాంక 5 బంతుల్లో 1 పరుగు చేయగా, నితీష్ రాణా 17 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఢిల్లీ ఆల్‌రౌండర్ సమీర్ రిజ్వీతో పాటు ట్రిస్టన్ స్టబ్స్ ఆ సమయంలో జట్టుకు అండగా నిలిచి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని గెలిపించారు. సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.