ఐపీఎల్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అంటే చాలు అందరి కళ్లు మీదే ఉంటాయి. . ఐపీఎల్ 2024లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక ప్రతి ఏడాది ప్లేయర్ల కంటే సంజీవ్ గోయెంకానే హైలెట్ అవుతూ వస్తున్నాడు. లక్నో మ్యాచ్ ఓడిపోయిందంటే.. ఆ రోజు కెప్టెన్‌కి క్లాస్ ఉన్నట్టేనని ఐపీఎల్ ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. లక్నో మ్యాచ్ తర్వాత రోజు సోషల్ మీడియా ఫీడ్ అంతా సంజీవ్ గోయెంకాతోనే నిండిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకానా స్టేడియం వేదికగా ఏప్రిల్ 1వ తేదీ రాత్రి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో తేలిపోయింది. ప్లేయింగ్ 11 బ్యాటర్ ఆర్డర్‌తో పాటు బౌలింగ్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ , కోచ్ జస్టిన్ లాంగర్‌తో చిట్ చాట్ చేశాడు. గోయెంకా తాను కామ్ అండ్ కూల్ అయ్యానని చెప్పినా సరే.. మ్యాచ్ ఓడిపోతే వచ్చే అసహనం మళ్లీ ఆయనలో కనిపించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫొటోలు కూడా ఇవే చెబుతున్నాయి. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌తో చేసిన బిహేవియరే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో కూడా పంత్‌తో ఒకట్రెండ్ సార్లు సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇదంతా గ్రౌండ్ లోపలే జరుగుతుండటమే విమర్శలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఈ సీజన్‌లో ఢిల్లీపై ఓటమి తర్వాత కూడా పంత్, లాంగర్‌తో సంజీవ్ గోయెంకా డిస్కషన్ చేశాడు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు, తప్పొప్పులపై మాట్లాడుతున్న సమయంలో సంజీవ్ గోయెంకా కాస్తంత సహనం కోల్పోయాడంటూ కొందరు నెట్టింట ఫొటోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రిషభ్ పంత్ కూడా సీరియస్‌గానే తానేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది. మొత్తానికి లక్నో మ్యాచ్ ఓడిపోతే మాత్రం గోయెంకా చేతిలో చిట్ చాట్ మాత్రం కామనే అని మరోసారి నిరూపితమైంది. సీజన్ ఆరంభ మ్యాచే ఇలా ఉంటే రానున్న మ్యాచ్‌లలో పరిస్థితి ఏంటంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన రెండో మ్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఏప్రిల్ 5న ఆడనుంది.