ఏపీవాసులకు అలర్ట్.. రేపు (ఏప్రిల్ 2) ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 8 మండలాల్లో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం రోజున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం రోజున కడప జిల్లా నమోదైంది. అలాగే కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం రోజు (ఏప్రిల్ 2) శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, బూర్జ మండలాలు, విజయనగరం జిల్లాలోని సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, పాలకొండ, సీతానగరం మండలాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జికే వీధి మండలం, పోలవరం జిల్లాలోని గుర్తేడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 17 మండలాలపై వడగాల్పుల ప్రభావం ఉంటుందని.. విజయనగరం (9), మన్యం (4), పోలవరం (2), ఏలూరు (1), ఎన్టీఆర్ (1) మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.మరోవైపు భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తలతిరగటం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండకు వెళ్లేటప్పుడు టోపీలు, రుమాలు వంటివి ధరించాలని.. తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించాలని సూచించింది. అలాగే ఎండలో నుంచి వచ్చినప్పుడు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవటమే మంచిదని సూచించింది.