పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తీపికబురు.. భారీగా నిధులు విడుదల

Wait 5 sec.

ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది.. చేసింది. అడ్వాన్స్‌ నిధులు మరో రూ.1,301 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1508 కోట్లు విడుదల చేయగా.. తాజాగా విడుదల చేసిన రూ.1508 కోట్లు కలిపి మొత్తం రూ.2,809 కోట్లు కేంద్రం నుంచి పోలవరానికి అందాయి. కేంద్ర బడ్జెట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు నిధులు దాదాపుగా వచ్చేశాయి. కేంద్రం నుంచి తొలుత వచ్చిన రూ.1508 కోట్లలో ప్రాజెక్ట్ పనుల కోసం రూ.600 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మరో రూ.300 కోట్లు పునరావాసం, భూసేకరణ కోసం ఖర్చు చేశారు. కేంద్రం నుంచి వచ్చే అడ్వాన్స్ నిధుల్లో 75శాతం ఖర్చు చేస్తే ఆ తర్వాత అడ్వాన్స్ నిధులు వస్తాయి. అయితే గతంలో ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిన రూ.300 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయలేదు. ప్రాజెక్టు పనుల్ని అనుకున్న మేరకు పూర్తి చేసినా సరే పలు కారణాలతో ఈ నిధులు ఇవ్వలేదు. అయితే ఇటీవల కేంద్ర జల్‌శక్తి అధికారి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో ఏపీ అధికారులు ఈ సమస్యను ఆయనకు వివరించారు.. సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కోసం సింగిల్ నోడల్‌ అకౌంట్‌కు నిధులు విడుదల చేయడం ఇదే ఆఖరిసారి. ఇకపై స్పర్శ్ విధానంలో నిధుల్ని విడుదల చేయనున్నారు. గతంలో అడ్వాన్స్ నిధుల్ని కేంద్రం రాష్ట్ర ఖజనాకు పంపించేది. ఆ తర్వాత పోలవరం సింగిల్ నోడల్ ఏజెన్సీకి చేరేవి.. అక్కడి నుంచి బిల్లులు చెల్లింపులు చేసేవారు. ఇకపై కేంద్రం స్పర్శ్‌ ద్వారా నిధుల్ని నేరుగా నేరుగా ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్ట్ పనిచేసిన మేరకు బిల్లు సమర్పిస్తే.. ఆ వెంటనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.మరోవైపు ఏపీ గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం (ఏప్రిల్ 2న) పర్యటనకు వెళుతున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాకినాడ నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి పోలవరం ప్రా జెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టును పరిశీలించి నిర్మాణ పనులు ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకుంటారు. పోలవరం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు.