రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల కూడా కందిపప్పు లేనట్లే, మూడు రకాల సరుకులు మాత్రమే ఇస్తారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా బ్యాడ్‌న్యూస్.. ఏప్రిల్ నెలలో కూడా కందిపప్పు లేనట్లే. నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభంకాగా.. ఈసారి కూడా కార్డుదారులకు బియ్యం, చక్కెరను అందిస్తున్నారు. అలాగే గోధుమపిండి, కొన్ని జొన్నలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల అయినా కందిపప్పు పంపిణీ చేస్తారని ఆశలు పెట్టుకోగా.. ఈసారి కూడా లేకుండా పోయాయి. మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉంది.. దీంతో కొనుగోలు చేయడం భారంగా మారింది. అందుకే ఏపీ ప్రభుత్వ కందిపప్పు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే బావుంటుందని కోరుతున్నారు. వచ్చే నెలలోనైనా కందిపప్పు పంపిణీ చేయాలని కోరుతున్నారు. అయితే పట్టణాల్లో ఉన్న రేషన్ కార్డులు ఉన్నవారికి జనవరి నుంచి రూ.20కే కేజీ గోధుమపిండిని పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేషన్ పంపిణీలో భాగంగా.. 60ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటుగా దివ్యాంగులకు వారి ఇళ్ల దగ్గరికే తీసుకెళ్లి అందజేస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది.. ప్రధానంగా బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తుండగా.. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాలశాఖలో ప్రక్షాళన చేశారు. కొన్ని నెలల పాటూ కందిపప్పును పంపిణీ చేశారు.. కానీ ఆ తర్వాత నుంచి కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. ఏ నెలకు ఆ నెల పంపిణీ చేస్తారని ఎదురు చూస్తున్నా ఆ దిశగా అడుగులుపడటం లేదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. మళ్లీ పాత విధానంలో రేషన్ షాపుల్లోనే సరుకుల్ని పంపిణీ చేస్తోంది. అంతేకాదు ప్రతి నెల 1వ తేదీ నంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన షాపుల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పంపిణీ చేస్తున్నారు.. ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసింది. రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాల జరగకుండా ఈ స్మార్ రేషన్ కార్డుల్ని తీసుకొచ్చింది. ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు కొత్తగా ఈపోస్ యంత్రాలను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త యంత్రాలతో సిగ్నల్ సమస్యలు కూడా ఉండవు అంటున్నారు.