బెంగళూరు ఐటీ ఇండస్ట్రీలో అలజడి.. 3 ఏళ్లలో 80 శాతం ఉద్యోగాలకు AI ఎసరు.. షాకింగ్ రిపోర్ట్!

Wait 5 sec.

Bangalore IT Slaves: ప్రపంచ టెక్నాలజీ ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధస్సుతో ఎన్నో మార్పులు రానున్నాయి. ప్రజలకు ఎంత మేలు ఉందో అంతకు మించిన ముప్పు ఉందని టెక్ నిపుణులు, పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కుబేరులు సైతం ఏఐపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ వల్ల దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. భారత్‌లోనూ ఏఐ ప్రభావం భారీగానే ఉంది. దిగ్గజ ఐటీ, టెక్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓ టెక్కీ సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే 3 ఏళ్లలో బెంగళూరులో ఏకంగా 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన టెక్కీ ఇటీవలే ఉద్యోగం కోల్పోయారు. కానీ, తాను ఎలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొంటూ లేఆఫ్స్ ప్రక్రియపై రెడ్డిట్ పోస్టులో పలు అంశాలను రాసుకొచ్చారు. బెంగళూరులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు నగరంలో ఇల్లు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇల్లు కొనడానికి బదులుగా అద్దె ఇంట్లోనే ఉన్న తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నారు. అతను ఓ పెద్ద టెక్ కంపెనీలో నేరుగా ఏఐ మైగ్రేషన్ ప్రాజెక్టులోనే పని చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలోనే ఇల్లు కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.2 కోట్లు తన వద్ద ఉన్నాయని, కానీ ఇల్లు కొనుగోలు చేయాలేదని రాసుకొచ్చారు. తన ఆఫీసుకు సమీపంలోనే రెంటుకు ఉన్నట్లు తెలిపారు. నేరుగా ఏఐపై పని చేయడం ద్వారా రానున్న కొద్ది సంవత్సరాల్లో ఐటీ ఉద్యోగుల పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అర్థమైందంటూ బాంబు పేల్చారు. 'ఐటీ రంగంలోని ఉద్యోగులలో సుమారుగా 70 శాతం నుంచి 80 శాతం మంది సేవా ఆధారిత కంపెనీలలో పనిచేస్తున్నారు. క్లయింట్లు కోరుకుంటే వారిలో చాలా మంది చేసే పనిని రాబోయే పూర్తి చేస్తుంది. దీంతో రానున్న 1 నుంచి 3 సంవత్సరాలలో ఏఐ (AI) సాధనాలతో వారిని నేరుగా భర్తీ చేయవచ్చు. అయితే, అంతర్గత సమాచారం, ఉన్నతాధికారుల వంటి వారి ప్రకారం 70 శాతం మంది ఉద్యోగం కోల్పోయేందుకు 3-5 ఏళ్ల పట్టవచ్చని అర్థమవుతోంది. మిగిలిన 30 శాతం మంది ఉద్యోగాలు సురక్షితమే. ఏఐ ఏజెంట్ల నిర్వహణ కోసం 30 శాతం మానవ శక్తి అవసరం.' అంటూ రాసుకొచ్చారు. పంచుకున్నారు. ' ఉద్యోగుల తొలగింపుల ద్వారా రెండు ప్రయోజనాలు పొందుతున్నారు. తాము ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్న ప్రచారం జరుగుతుదని, అలాగే తక్కువ మందితోనే పనిని పూర్తి చేయవచ్చని నిరూపిస్తున్నట్లు అవుతుంది. ఇక రెండోది శాలరీలను తగ్గించడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవచ్చని భావిస్తున్నాయి' అని రెడ్డిట్ యూజర్ రాసుకొచ్చారు. తాను గతంలో నేరుగా చేసిన పనిని ఆటోమేట్ చేసే ఏఐ ప్రాజెక్టులోనే పని చేసినట్లు టెక్కీ తెలిపారు. భవిష్యత్తులో సేవా-ఆధారిత ఐటీ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగు కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.