20 ఏళ్లు కష్టపడి పనిచేసినా వదలని 'ఒరాకిల్'.. క్యాన్సర్ రోగి.. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదని ఆవేదన!

Wait 5 sec.

2026: ఏఐ డేటా సెంటర్లపై విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ టెక్ సంస్థ.. ఒరాకిల్ షాకింగ్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న (బుధవారం) ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ . ఇందులో భారత్‌లో పనిచేసేవారే 12 వేల మంది వరకు ఉన్నారు. ఇక్కడ చాలా మందికి ముందస్తు సమాచారం లేకుండానే.. మెయిల్ ద్వారా సమాచారం అందించారని తెలుస్తోంది. ఇక్కడ బాధితులు.. తమ అనుభవాల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసుుకుంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా.. సంస్థ ఒక్క మెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆరోపిస్తున్నారు. >> ఇక్కడ ఒక బాధిత ఉద్యోగి కుమారుడు తన తండ్రికి సంబంధించిన లేఆఫ్ అనుభవాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఒరాకిల్ లేఆఫ్స్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. దాదాపు 20 ఏళ్ల పాటు కంపెనీలో పనిచేసినా.. క్యాన్సర్‌తో పోరాడుతున్న వ్యక్తిని.. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందుగా సడెన్‌గా తొలగించినట్లు చెబుతున్నాడు. అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదని.. వేరే జాబ్ . ఇది వైరల్ అవుతోంది. 'మా నాన్న ఒరాకిల్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒకే బాస్ కింద ఇన్నేళ్లు పనిచేస్తున్నారు. కనీసం ముందస్తు ఫోన్ కాల్ లేదా ఇతర సమాచారం లేకుండానే ఒక్క ఇ- మెయిల్‌తో తొలగించారు. అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ఉంది. ఇప్పుడెలా.. అసలు ఏం చేయాలి?' అని ప్రశ్నించాడు. దీనికి అదనంగా ఒరాకిల్ బాస్.. తన తండ్రికి ఒక టెక్ట్స్ మెసేజ్ మాత్రమే చేశారని.. అది కూడా 'రీడ్ యువర్ మెయిల్' అనే ఉందని చెప్పాడు.ఒరాకిల్ ఇ- మెయిల్‌లో.. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు పేర్కొనగా.. లేఆఫ్స్ తక్షణమే అమల్లోకి వస్తాయని.. ఈ రోజే లాస్ట్ వర్కింగ్ డే అని పేర్కొనడం మరిన్ని విమర్శలకు దారితీసింది. ఇంకొందరు కూడా ఇలాగే లేఆఫ్స్ గురించి తమ బాధల్ని పంచుకుంటున్నారు. 6 నెలల కిందటే అమెరికా నుంచి ఒరాకిల్ కెనడాకు తనను పంపిందని.. ఇప్పుడు లేఆఫ్స్ చేసిందని మరో ఉద్యోగి వాపోయాడు.