ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్.. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రెండు గంటల పాటు వివిధ పార్టీల సభ్యులు బిల్లుపై చర్చించారు. ఆ తర్వాత బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. గురువారం రోజున ఈ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకురానుంది.