మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు.. అవకాశం దొరికితే రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడుకు చెందిన అనే మహిళ కూడా కొత్త చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో తొలి మహిళా అంబులెన్స్ హెవీ వెహికిల్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. ఒకప్పుడు క్లా్‌స్‌రూమ్‌లలో పాఠాలు చెప్పిన టీచరమ్మ.. ఇప్పుడు స్టీరింగ్ పట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. సమాజానికి మరింత దగ్గరగా సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల ప్రాణాలను కాపాడే అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడుకు చెందిన మన్నెం కల్పన డిగ్రీ పూర్తి చేశారు.. ఆ తర్వాత టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డ్రైవింగ్ వైపు వెళ్లాలని భావించారు.. ఆర్టీసీ ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుని అక్కడ చేరారు. అక్కడ 15మంది బ్యాచ్ ఉంటే.. వారిలో ఒకే ఒక్క మహిళ కల్పన. అయినా సరే మిగిలిన 14మంది తనను అక్క అని గౌరవంగా పిలుస్తూ తాను డ్రైవింగ్ నేర్చుకోవడానికి సహకరించాలని కల్పన చెబుతున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ పొందిన తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్రైవర్‌గా చేరారు కల్పనం. మొదట్లో తోటి డ్రైవర్లు ఆమెను తక్కువ అంచనా వేశారు.. ఓ నెలకు మించి ఉండరు, ఉద్యోగం మానేసి వెళ్లిపోతారని కామెంట్ చేశారు. కానీ కల్పన మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగారు. కల్పన విజయవాడలో మాత్రమే కాదు.. ఇటీవలే ఒక్కరే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లి పేషెంట్‌ను దిగబెట్టి వచ్చారు. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ పొందడం అంత సులభం కాదు.. అయినా సరే పట్టుదలతో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ సంపాదించారు. అంబులెన్స్ డ్రైవర్ అంటే అంత ఆషామాషీ కాదు.. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంటుంది.. ఈ సవాళ్లను దాటుకుని కల్పన ముందుకు సాగుతున్నారు. కల్పన డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రారంభించినప్పటి నుంచి అంబులెన్స్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరే వరకు ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని వచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్రైవర్‌గా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. టీచింగ్ నుంచి డ్రైవింగ్ వరకు ఆమె ప్రస్థానం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.. ఎందరో మహిళలకు ధైర్యం నింపుతోంది. కల్పన సమాజానికి సేవ చేయాలనే నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం. మహిళలంటే కేవలం ఇంటి పనులకే పరిమితం కాకూడదని.. ఏ రంగంలోనైనా రాణిస్తారని ఆమె నిరూపించారు. ఒకప్పుడు తరగతి గదుల్లో బ్లాక్‌బోర్డ్ ముందు నిలబడి పిల్లలకు జ్ఞానం అందించిన టీచరమ్మ.. ఇప్పుడు రోడ్లపై అంబులెన్స్ స్టీరింగ్ పట్టుకుని ప్రాణాలను కాపాడాలని పోరాడే ధైర్యవంతురాలు, యోధురాలని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మహిళా హెవీ వెహికిల్ లైసెన్స్‌తో అంబులెన్స్ నడిపే డ్రైవర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కల్పన. ఆమె సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.