ఇండిగోకు కొత్త సీఈఓ నియామకం.. ఒక్కరోజే రూ. 400 పెరిగిన షేర్ ధర.. ఇన్వెస్టర్లకు కాసుల పంట!

Wait 5 sec.

Indigo Share Price Rise: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12.20 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పెరిగి 73,730 స్థాయిలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 530 పాయింట్ల వరకు పెరిగి 22,860 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ . ఇక్కడ ప్రధానంగా మనం ప్రముఖ విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) షేర్ల గురించి తెలుసుకుందాం. కిందటి రోజు NSE లో రూ. 3,943.50 వద్ద ఉండగా.. ఏప్రిల్ 1 సెషన్‌లో భారీగా పుంజుకుంది. నేరుగా 3 శాతానికిపైగా లాభంతో రూ. 4063.80 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా ఇంట్రాడేలో ఇంకా దూసుకెళ్లింది. ఒక దశలో స్టాక్ ధర 10 శాతం వరకు పెరిగి రూ. 4,332.70 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. కిందటి క్లోజింగ్ ధరతో చూస్తే సుమారు ఒక్కరోజులోనే రూ. 400 వరకు పెరిగింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతోంది.ఇక్కడ స్టాక్ మార్కెట్లలో సానుకూల పరిణామాలకు తోడు.. మరో ప్రకటన కూడా ఇండిగో షేరు భారీగా పుంజుకునేందుకు కారణంగా నిలిచింది. ఇండిగో సంస్థ కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌ను నియమించింది. ఈయన బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్ కావడం విశేషం. అంతకుముందు ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్ ఉండగా.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఇప్పుడు వాల్ష్‌తో భర్తీ చేసింది. ప్రస్తుతం వాల్ష్.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. జులై 31తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ఆగస్ట్ 3 తర్వాత ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.గత సంవత్సరం డిసెంబరులో సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. అప్పుడు ప్రయాణికుల సర్వీసులపై తీవ్ర అంతరాయం పడింది. ఇండిగోపై విమర్శలు కూడా భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో పీటర్ ఎల్బర్స్ పదవీ కాలం ముగియడానికి 18 నెలల ముందుగానే అకస్మాత్తుగా రాజీనామా చేశారు. . ఈ క్రమంలోనే అప్పుడు భారీగా పతనం అయ్యాయి కూడా. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 6,232.50 గా ఉండగా.. ఒక దశలో ఇటీవల రూ. 3,895.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు సీఈఓ నియామకంతో ఇండిగో షేర్లు దూసుకెళ్తున్నాయి.