Russia Envoy on Where is Mojtabha Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కావస్తున్నా.. ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయ స్థాయిలో పెను ఉత్కంఠకు దారితీస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఆయన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా పగ్గాలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన పేరిట ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ.. ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయనకు గాయాలు అయ్యాయని కొందరు, చనిపోయారని మరికొందరు ఊహాగానాలు చేశారు. కానీ తాజాగా రష్యా రాయబారి మొజ్తభా ఖమేనీ ఎక్కడ ఉన్నారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.మొజ్తబా ఇరాన్‌లోనే ఉన్నారు: రష్యా రాయబారివస్తున్న ఊహాగానాలకు రష్యా రాయబారి అలెక్సీ డెడోవ్ తెరదించారు. "సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదు" అని డెడోవ్ స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగుతున్న తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యానే ఆయన కనిపించడం లేదని, అజ్ఞాతంలో ఉండి ఉండవచ్చని రష్యా దౌత్య వర్గాలు కూడా భావిస్తున్నాయి.చికిత్స కోసం మొజ్తబా రష్యాకు వెళ్లారా?మొజ్తబా ఆచూకీపై అమెరికా గూఢచారి సంస్థలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరలో జరిగిన దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తు పట్టలేనంతగా దెబ్బతిందని అమెరికా అనుమానిస్తోంది. మరోవైపు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై గతంలోనే స్పందించిన ఇరాన్.. మొజ్తబా తమ దేశంలో లేడని తేల్చి చెప్పింది. ఆయన బతికే ఉన్నారని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఎక్కడున్నారనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా రష్యా రాయబారి మొజ్తభా ఇరాన్‌లోనే ఉన్నారని తేల్చి చెప్పడంతో.. అంతా అదే నిజమని భావిస్తున్నారు. యుద్ధంలో ప్రాణాలు పోయే అవకాశం ఉండడంతో.. ఎక్కుడో రహస్య ప్రదేశంలో దాక్కున్నారని అనుకుంటున్నారు.తెర వెనుక ఉండి చక్రం తిప్పుతోంది ఎవరు?56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ గత నాలుగు దశాబ్దాలుగా తన తండ్రి నీడలోనే ఉంటూ తెర వెనుక రాజకీయం నడిపారు. ఇప్పుడు దేశంలో అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నప్పటికీ.. ఆయన బహిరంగంగా కనిపించకపోవడం గమనార్హం. ఆయన లేకపోయినా ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ విప్లవ దళాలు (ఐఆర్‌జీసీ) పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఎదురు దాడులు కొనసాగిస్తున్నాయి. నాయకుడు అజ్ఞాతంలో ఉన్నా.. దేశంలోని భద్రతా సంస్థలే ఇప్పుడు ఇరాన్ పాలనా చక్రాన్ని తిప్పుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.నాయకుడు కనిపించకపోయినా, ఆయన పట్ల విధేయత ప్రకటించేందుకు వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. "అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం" అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ అంతర్గత వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనం.