ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు.. రూ.7,059 కోట్లకు లైన్ క్లియర్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట దక్కనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ దగ్గర నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల్ని నిధుల లభ్యతను బట్టి విడతలవారీగా విడుదల చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల వంటివాటికి సంబంధించి బకాయిలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఈపీఎఫ్‌వోపై రిక్వెస్ట్మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్‌వో సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎంయూఏ (నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌) లేఖ ద్వారా ఆర్టీసీ ఎండీని కోరింది. ఉద్యోగులు హయ్యర్‌ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారిలో కొందరికి డిమాండ్‌ నోటీసులు రాలేదన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి హయ్యర్‌ పింఛను వచ్చేలా చూడాలని కోరింది. కొంతమందిఆన్‌లైన్‌లో వచ్చిన డిమాండ్‌ నోటీసుల గురించి తెలియలేదని.. అందుకే డబ్బులు చెల్లించలేకపోయారన్నారు. అలాంటి ఉద్యోగులకు మరోసారి డబ్బులు కట్టేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఉద్యోగి నుంచి 58 ఏళ్ల వరకే పింఛన్ కంట్రిబ్యూషన్ రికవరీ చేయాలని.. కానీ 8వేలమందికిపైగా ఉద్యోగులకు మొత్తం రూ.32.88 కోట్లు రికవరీ చేసి ఈపీఎఫ్‌వోకి పంపారన్నారు. వీటిని ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని ఎన్ఎంయూఏ కోరింది. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ఫోర్టో రిక్వెస్ట్ ఏపీలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసంప్రత్యేకంగా పరిపాలన ట్రైబ్యునల్‌‌ను తిరిగి పునరుద్ధరించాలని రిజిస్టర్డ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ ఫోరం కోరింది. ఈ ట్రైబ్యునల్‌ను 2022లో రద్దు చేశారని.. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రైబ్యునల్ ద్వారా సీనియారిటీ, ప్రమోషన్లు, బదలీలు సహా ఇతర అంశాలను ట్రైబ్యునల్ త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది అన్నారు. అందుకే ట్రైబ్యునల్‌ను పునరుద్ధరించాలని కోరింది ఫోర్టో.