పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరో రెండు వారాల్లో ముగిసే అవకాశం ఉందని హర్మూజ్ జల సంధి దిగ్భంధనం ఫలితంగా పెరిగిన ఇంధన ధరల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. గత నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, లేకుండానే యుద్ధం ముగించేందుకు ట్రంప్ సిద్ధమైనట్టు సంకేతాలు ఇచ్చారు. తాము ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతే.. హర్మూజ్‌ దానంతట అదే తెరుచుకుంటుందని అన్నారు.ఒక వేళ నిజంగా యుద్ధం రెండు వారాల్లోనే ముగిస్తే.. ఘర్షణకు ముందు స్థాయికి చమురు ఉత్పత్తి పునరుద్ధరణ, హర్మూజ్‌లో ట్యాంకర్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరడానికి మరో ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. ఎందుకంటే, యుద్ధం ప్రారంభంలో వచ్చిన థామ్సన్ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం నిలిచిపోయిన ట్యాంకర్ల నౌకల ప్రభావం మార్కెట్‌పై పటడానికి కనీసం రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది. అంటే అసలైన ఇంధన సంక్షోభం ఇప్పుడిప్పుడే మొదలుకానుంది.పునరుద్దరణకు 8 వారాలుమాక్వారీ గ్రూప్ స్ట్రాటజిస్ట్ వికాస్ ద్వివేది మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కూడా బహుశా రెండు వారాలు పట్టవచ్చు... ఉత్పత్తి పునరుద్ధరణకు ముందు అధిక స్థాయిలో పేరుకుపోయిన చమురు నిల్వలను ఓడల్లోకి ఎక్కించాలి. దానికి (ఉత్పత్తిని పునరుద్ధరించడానికి) మరికొన్ని వారాలు పడుతుంది’’ అని అన్నారు. ఇరాన్ లేదా అమెరికా- ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న ఇంధన మౌలిక సదుపాయాల మరమ్మతులు, పునర్‌నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా నష్టం ఎంత జరిగిందనేది ఇంకా స్పష్టంగా లేనందున ఈ సమయం మరింత అవసరమని పేర్కొన్నారు. దాడుల్లో భారీ రిఫైనరీలు, చమురు క్షేత్రాలు దెబ్బతింటే వాటి పునరుద్దరణకు కొన్ని నెలలు లేదా ఏడాది వరకు పడుతుందని ద్వివేది వివరించారు.సీ మైన్స్ ముప్పుహర్మూజ్ జల సంధి వెడల్పు కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. మధ్యలో ఒక్కొక్కటి 3.2 నుంచి 3.7 కిలోమీటర్ల వెడల్పు గల కేవలం రెండు నిర్దేశిత షిప్పింగ్ లేన్‌లు మాత్రమే ఉంటాయి. ఇక, యుద్ధం సమయంలో ఇరాన్ మహమ్-3, మహమ్-7 వంటి శక్తివంతమైన సీమైన్స్‌ను అమర్చినట్టు రాయిటర్స్ నివేదించింది. యుద్ధం ఆపేసిన తర్వాత వీటిని తొలగించడం అత్యంత ప్రమాదరకమైన ప్రక్రియ. ఇందుకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే కానీ నౌకల రవాణా పునరుద్దరణ జరగదు. దాడికి గురైన నౌకల నుంచి శిథిలాలను తొలగింపు కూడా సంక్లిష్టంగా మారవచ్చు.రవాణా ఖర్చుల భారంపశ్చిమాసియా ఘర్షణ కారణంగా క్రూడాయిల్ రవాణా చేసే ట్యాంకర్ల అద్దె భారీగా పెరిగింది. గతేడాది ఈ సమయంలో రోజుకు లక్ష డాలర్లుగా ఉన్న అద్దె.. ఇప్పుడు 4 లక్షల డాలర్లకు చేరుకుంది. భారత్‌కు వస్తున్న ఓ నౌక మార్చి నెలలో రోజుకు 7.7 లక్షల డాలర్లు అద్దె చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ భారం వినియోగదారులపైనే పడుతుంది.‘ఇది ఊహించలేనంత అధిక ధర.. లక్ష అమెరికన్ డాలర్లు అంతకంటే ఎక్కువ ఉంటే భారీ ఖర్చుగానే పరిగణిస్తారు.. గతేడాది మేము దానిని భారీ ఖర్చుగానే భావించాం’ అని నార్వేకు చెందిన రిస్టాడ్ ఎనర్జీ సీనియర్ విశ్లేషకుడు ఎరిక్ గ్రండ్ట్ తెలిపారు. షిప్పింగ్ ఖర్చులో ట్యాంకర్ ధర ఒక భాగం మాత్రమే. మిగతావి ఇంధనం, పోర్ట్ ఛార్జీలు, కాలువ ఖర్చులు, ఇతరాలు, ఇవన్నీ కలిసి రోజుకు మరో 50,000 అమెరికన్ డాలర్ల వరకు చేరవచ్చని గ్రండ్ట్ చెప్పారు.పోరాటం కొనసాగితేఒకవేళ యుద్ధం ముగియకపోతే పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని వారాలు, లేదా నెలలు కూడా పట్టొచ్చు. ఇది చమురు సరఫరా, ధరల పునరుద్ధరణ కాలపరిమితిని ఇంకా పొడిగిస్తుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన డేటా ప్రకారం.. 13 వారాల పాటు మూసివేత (యుద్ధం ఇప్పటికే ఆరో వారానికి చేరువలో ఉంది) నుంచి కోలుకోవడానికి ఎనిమిది వారాల వరకు పడుతుంది. అలాగే,ముప్పు పొంచి ఉంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత చమురు ధరలు 40 శాతానికిపైగా పెరిగి, బెంట్ క్రూడ్ బ్యారెల్ 100 డాలర్లకు చేరింది. భారత్‌పై ప్రభావంభారత్ దేశీయ చమురు అవసరాల్లో దాదాపు 50 శాతం హర్మూజ్ జల సంధి ద్వారానే దిగుమతి అవుతోంది. మరో రెండు నెలలకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నిల్వలు, ఇతర దేశాల నుంచి దిగుమతి వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ప్రీమియం పెట్రోల్, కమర్షియల్ గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. విమాన ఇంధన ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఆసియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇంధన పరిమితులు, ఎమర్జెన్సీ ప్రకటించాయి.