గజిబిజిగా లక్నో బ్యాటింగ్ ఆర్డర్.. పంత్ ఓపెనింగ్‌తో పూర్తిగా పతనం!

Wait 5 sec.

ఐపీఎల్‌ 2026 బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్‌ ఉన్న జట్లలో ఒకటి. గత సీజన్‌లో కూడా లక్నో భారీ స్కోర్లు నమోదు చేసింది. బలమైన టాప్ ఆర్డర్‌తో పాటు ఆఖరి ఓవర్లలో సిక్సర్లు బాదగలిగే హిట్టర్లు లక్నోలో ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీనికి ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్‌గానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో లక్నో ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కరమ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో లక్నో భారీ స్కోర్లు నమోదు చేసింది. చాలా మ్యాచ్‌లలో ఈ ఇద్దరే వందకు పైగా పార్ట్‌నర్‌షిప్‌లు కూడా చేశారు. అయితే ఈ ఏడాది మొత్తం మారిపోయింది. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చే ఈ సారి ఓపెనింగ్‌కి వచ్చేశాడు. దాంతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం గజిబిజి గందరగోళంగా మారింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్‌తో పాటు రిషభ్ పంత్ ఓపెనింగ్ చేశాడు. మూడో స్థానంలో ఎయిడెన్ మార్కరమ్, నాలుగులో ఆయుష్ బదోనీ.. ఇక డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ మిడిలార్డర్‌లో క్రీజులోకి వచ్చాడు. అబ్దుల్ సమ్మద్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆల్‌రౌండర్లుగా ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్ ఉండగా.. ఇక మిగతా మూడు వికెట్లు షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్. గత సీజన్‌లో రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో ఆడటంతో మార్ష్, మార్కరమ్ ఓపెనింగ్ చేశారు. తర్వాత పూరన్, బదోనీ.. మిడిలార్డర్‌లో రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చేవాడు. ఆఖర్లో అబ్దుల్ సమ్మద్ బ్యాట్‌తో రెచ్చిపోవడంతో భారీ స్కోర్స్ నమోదయ్యేయి. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులతోనే కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. మార్ష్ 28 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 పరుగులతో యథావిధిగా మంచి ఆరంభమే ఇచ్చినా.. రిషభ్ పంత్ 9 బంతుల్లో 7 పరుగులే చేసి అవుటయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన మార్కరమ్ 11, ఆయుష్ బదోనీ 0, నికోలస్ పూరన్ 8 పరుగులతో వరుసగా విఫలమయ్యారు. అబ్దుల్ సమ్మద్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 36 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మొదటి మ్యాచ్‌లో ప్రయోగం వికటించడంతో రెండో మ్యాచ్‌లో అయినా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తారా? లేక ఇలానే కంటిన్యూ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.