ట్రంప్ ఒక్క ప్రకటనతో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర.. బంగారం ధరల్లో భారీ మార్పు.. ఏప్రిల్ 1 రేట్లు ఇవే..

Wait 5 sec.

22k : బంగారం కొనుగోలు చేయాలనుకునే అలర్ట్. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారీగా దిగొచ్చిన పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ వెళ్తున్నాయి. వరుసగా 4-5 రోజులుగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తేదీ కూడా గోల్డ్ రేట్లు ఎగబాకాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఏప్రిల్ 1 న ఉదయం వార్త రాసే సమయంలో 8 గంటలకు రూ. 1150 మేర పెరిగి 10 గ్రాములకు రూ. 1,37,050 కి చేరింది. దీనికి ముందు కూడా వరుసగా బంగారం ధరల పెరిగిన సంగతి తెలిసిందే. మార్చి 27న రూ. 950, 28న రూ. 2300 మేర పెరగ్గా.. మార్చి 30న రూ. 150 పుంజుకుంది. ఇలా . హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే ఇప్పుడు రూ. 1250 పెరగడంతో తులం రూ. 1,49,510 కి చేరింది. దీనికి ముందు వరుసగా రూ. 170, రూ. 2510, రూ. 1030 మేర రేట్లు పెరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ ఇంకా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి భారీగానే దిగువన ఉన్నాయి. జనవరి 29న 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,78,850 వద్ద గరిష్ఠాన్ని తాకింది. సుమారు రూ. 30 వేల దూరంలో ఉందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా అదే రోజున రూ. 1,63,950 వద్ద గరిష్ఠాన్ని తాకింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమమైన సమయంలో మార్చి 1న కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో రూ 4-5 వేల వరకు తక్కువలో ఉన్నాయి. తగ్గిన వెండి ధర..బంగారం ధర పెరిగినప్పటికీ దేశీయంగా వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. ఒక్కరోజే రూ. 5 వేలు తగ్గగా హైదరాబాద్ నగరంలో కేజీకి రూ. 2.50 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు మార్చి 28, 30 తేదీల్లో రూ. 5 వేల మేర పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక్కరోజులో దాదాపు 100 డాలర్ల వరకు పుంజుకొని 4700 డాలర్ల స్థాయికి చేరింది. సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగి 75 డాలర్లకు ఎగబాకింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకొని రూ. 93.95 వద్ద ఉంది. ట్రంప్ సంకేతాలతో పెరిగిన బంగారం ధరలు..యుద్ధం ప్రారంభమైన సమయంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగ్గా.. ద్రవ్యోల్భణం భయాలు పెరిగాయి. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. దీంతో అటువైపు ప్రతిఫలం ఎక్కువగా ఉండటంతో.. బంగారం ఆకర్షణ కోల్పోయి వరుసగా ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఇచ్చారు. దీంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు కిందటి రోజు 115 డాలర్ల స్థాయిలో ఉండగా.. 10 శాతం వరకు తగ్గి ప్రస్తుతం 105 డాలర్ల స్థాయికి చేరింది. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయని తెలుస్తోంది.