: కొంత కాలంగా పలు దిగ్గజ ఐటీ, టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కంపెనీల కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచేందుకు.. ఇతర ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, అసెంచర్, యూపీఎస్, మోర్గాన్ స్టాన్లీ ఇలా ఎన్నో కంపెనీలు ఇటీవల లేఆఫ్స్ విధించాయి. ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఈ లిస్టులో చేరింది. అదే అమెరికా ప్రధాన కేంద్రంగా క్లౌడ్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, డేటాబేస్ సాఫ్ట్‌వేర్ వంటి సర్వీసుల్ని అందిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్. ఈ సంస్థ .. అదే నిజమైంది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 30 వేల మంది తమ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 30 వేల మంది వరకు ఉద్యోగులపై వేటు వేయగా.. భారత్‌లోని ఉద్యోగులపైనా గణనీయంగా ప్రభావం పడింది. ఇక్కడే సుమారు 12 వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో చాలా మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు/సమాచారం లేకుండానే తొలగించిందని తెలుస్తోంది. ఉదయం 5- 6 గంటల సమయంలోనే చాలా మందికి ఇ- మెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపించి.. తక్షణమే తొలగింపు అమల్లోకి వస్తుందని ప్రకటించిందని పలు ఆంగ్ల మీడియాలు నివేదిస్తున్నాయి.ఎక్కువగా ఒరాకిల్ కంప్యూటింగ్ బిజినెస్ సెగ్మెంట్‌లో ఉద్యోగులపై ప్రభావం పడినట్లు భావిస్తున్నారు. అమెరికా సహా ఇండియా, మెక్సికోలోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. కంపెనీ అధికారికంగా ఎక్కడా ప్రకటించనప్పటికీ.. బ్లైండ్, రెడిట్, X వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఈ లేఆఫ్స్‌ను ధ్రువీకరిస్తున్నాయి. బాధిత ఉద్యోగులు కూడా తమ లేఆఫ్స్ గురించి వీటిల్లో గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలిసింది. ఇండియాలోనే 12 వేల మంది అవుట్!భారత్‌లో ఒరాకిల్ ఉద్యోగులు సుమారు 30 వేల మంది వరకు ఉండగా.. ఇందులో సుమారు 40 శాతం వరకు (12 వేలు) ఉద్యోగుల్ని తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అనేది సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 18 శాతం వరకు ఉంది.'ఒరాకిల్‌లో సీనియర్ మేనేజర్‌గా ఉన్న నా స్నేహితుడు ఫోన్ చేశాడు. 20 మంది టీంలో ఆరుగురిని వెళ్లిపోవాలని చెప్పారంట. చాలా టీంలలో దాదాపు 50 శాతం వరకు సిబ్బందిపై వేటు వేశారు. మొత్తం 20 శాతం వరకు ఉద్యోగుల్ని తొలగించినట్లు సమాచారం.' అని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇక్కడ కొందరు ఐదేళ్లు, పదేళ్లు, 20 ఏళ్ల సర్వీస్ ఉన్న వారిని కూడా సడెన్‌గా ఇ- మెయిల్‌తో తొలగించారని చెబుతూ వాపోతున్నారు. కొందరు ఎలాంటి హెచ్ఆర్ డిస్కషన్స్, మేనేజర్స్ నుంచి సమాచారం కూడా లేకుండానే తొలగించినట్లు చెబుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఉద్యోగిని 20 ఏళ్ల పాటు సేవ చేసినా.. తొలగించినట్లు కూడా సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు. ఏఐ డేటా సెంటర్ల కోసం..ఒరాకిల్ సంస్థ కొంత కాలంగా ఏఐ డేటా సెంటర్లపై విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే అందు కోసం నిధులు సమకూర్చుకోవడంలో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ప్రకటించగా.. మెటాలో ఈ సంఖ్య 16 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంకా యూపీఎస్, మోర్గాన్ స్టాన్లీ, ఒకాడో, బ్లాక్, అసెంచర్ వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి.