మంచి ఆలోచన అంటూనే.. హీరోలకు డ్రగ్స్ టెస్టు సూచనపై.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్!

Wait 5 sec.

వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ గురించి జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. సినిమా హీరోలకు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్‌ అంటే సినిమా ఇండస్ట్రీ పేరు బయటికి వస్తుందని.. జనాలు మాట్లాడుకుంటున్నారని.. అందుకే సినిమా హీరోలు.. అభిమానులకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే సినిమా హీరోలు.. తరచూ డ్రగ్స్ టెస్టులు చేయించుకుని.. ప్రజల్లో డ్రగ్స్ పట్ల అవగాహన తీసుకురావాలని పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలకు ఎక్స్‌లో మంచు విష్ణు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.సినిమా హీరోలు, హీరోయిన్లకు జనాల్లో క్రేజ్ ఉంటుందని.. తమ అభిమాన నటీనటులు ఏం చేస్తారో.. వాటినే ఫ్యాన్స్ ఆచరిస్తూ ఉంటారని.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే హీరోలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని హితవు పలికారు. 90 రోజులకు ఒకసారి హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకుని.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఫ్యాన్స్ వింటారని.. అలా చేయడం వల్ల సమాజంలో కూడా మార్పు వస్తుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ సంస్కృతికి నిలయంగా మారుతోందని ఆరోపణలు ఉన్నాయని.. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే యూరిన్ టెస్ట్ (మూత్ర పరీక్ష) ద్వారా అయితే డ్రగ్స్ తీసుకున్న కేవలం 14 రోజుల్లో మాత్రమే తెలుస్తుందని.. అందుకే వెంట్రుకల టెస్ట్‌తో అయితే 90 రోజుల వరకు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలుస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. డ్రగ్స్ టెస్ట్‌లు చేసుకుంటేనే వారి సినిమాలను విడుదల చేయాలని.. ఇలా చేస్తే ఎందుకు డ్రగ్స్‌ కంట్రోల్ కావని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులపై 6 నెలలకోసారి ఐటీ దాడులు జరగాలని.. వారి ఆస్తులను బహిరంగంగా వెల్లడించాలని.. అప్పుడే రాజకీయ నాయకులందరూ అవినీతిపరులు కాదని జనం నమ్ముతారని ఒక నెటిజన్ పేర్కొన్నారు. మరికొందరు నెటిజన్లు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ వ్యవహారం దుమారం రేపుతుండగానే.. సినీ నటుడు మంచు విష్ణు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇది చాలా మంచి సూచన అని పేర్కొన్న మంచు విష్ణు.. ఎన్నికల్లో రాజకీయ నాయకులు నామినేషన్ దాఖలు చేసే ముందు.. ఎలాంటి పరీక్షలు చేసుకోవాలని తాను ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులకు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారని తాను భావిస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.